
A3C Anaesthesia & Critical Care Consultant's
0 subscribers
About A3C Anaesthesia & Critical Care Consultant's
Updates in Anaesthesia, Safe Anaesthesia Practice, Anaesthesia and Critical Care Staffing, Publications in Anaesthesia, Critical Care and Emergency Medicine, Patient Safety.
Similar Channels
Swipe to see more
Posts

ఏ ఎందుకు? —————— ఈ మధ్య కాలంలో కొందరు, కాదు కాదు చాలా మంది పేషెంట్లు అసలు డాక్టర్ల దగ్గరకి ఎందుకు వస్తారో అర్థం కావడం లేదు. మనం చెప్పేది వినరు, పోనీ వాళ్ళు చెప్పింది చేసినా, అదికూడా ఫాలో అవ్వరు. ఆ సినారియో ఎలా వుంటుందో చెప్తా చూడండి…. అప్పోయింట్మెంట్ తీసుకుని, తెలిసినవాళ్ల దగ్గర రికమండేషన్ కాల్ చేపించుకుని, ఓపి ఫీస్ కట్టి మరీ వచ్చి కలిసి ప్రాబ్లెమ్ చెప్తారు, సరే ఎగ్జామిన్ చేసాక బేసిక్ ఇన్వెస్టిగేషన్ ఏమైనా రాద్దాము అనుకునే లోపు… ఎక్స్ రేలు స్కాన్లు ఏమీ వద్దు సర్, జస్ట్ మందులు రాసివ్వండి చాలు అంటారు. సరే మెడిసిన్స్ రాద్దాము అనేలోపు…. పెయిన్ కిల్లర్స్ అవీ రాయకండి సర్, నాకు పడవు అవి అంటారు. సరే కనీసం మీ మెయిన్ ప్రాబ్లెమ్ ఐన నొప్పి తగ్గడానికి పారాసిటమాల్ ఐనా రాస్తాను అని చెప్పి కన్విన్స్ చేసి రాసేలోపు…. ఈ టాబ్లెట్స్ వేసుకుంటే ఏమీ ప్రాబ్లెమ్ రాదు కదా, ఒకవేళ గ్యాస్ట్రైటిస్ వస్తే, అసిడిటీ టాబ్లెట్ రాయండి సర్ అంటారు. సరే కోర్స్ లాగా ఒక 10 డేస్ వాడి మళ్లీ కనపడండి, అప్పుడు అవసరం అనిపిస్తే ఎక్స్ రే చేద్దాములే అనగానే….. సర్ 10 డేస్ కష్టం సర్, ఒక మూడు రోజులు వాడి చూస్తాను అంటారు. సరే అలాగే వాడి, ఇబ్బంది ఐతే కనపడండి అని చెప్పాక…. తీరా నేను ఏమీ రాశానో చూకుంటే, వచ్చిన ప్రాబ్లెమ్ ఒకటి అయ్యింటుంది, అసలు ప్రాబ్లెమ్ కు అవసరమైన మందులు తక్కువ… కానీ ఎక్కువ మందులు రాసింది మాత్రం వస్తాదో రాదో తెలియని కడుపు మంటకి పాంటప్ వుంటుంది. ఆగండి… ఆగండి, అక్కడికి అవ్వలేదు… కనీసం ఆ మందులైనా కొన్నారా అంటే, అది కూడా కొనకుండా వెళ్ళిపోతారు! వాడుతారో లేదో తెలియదు, మళ్లీ వస్తారో రారో తెలియదు. మనం చెప్పేది కాకుండా… వాళ్ళకి కావాల్సిన సమాధానాలు విని, వాళ్ళకి తెలిసిన మందులు మనచేత రాయించుకుని, వల్ల స్టైల్లో అవి యూజ్ చేసి, అసలు ఎందుకు వచ్చారు, మనం ఏమి చేసాము, ఎందుకు వెళ్లిపోయారో అర్థం కాకుండా క్రియేట్ ఐన కన్ఫ్యూజన్లో మనం నెక్స్ట్ పేషెంట్ ను చూడాలి! దేవుడే కాపాడాలి ఇంక మమ్మల్ని

To all the anaesthetists