
Pawan Kalyan
January 29, 2025 at 10:18 AM
76వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీలోని కర్తవ్య పథ్ లో ప్రదర్శించిన శకటాల పరేడ్ లో ఆంధ్రప్రదేశ్ తరపున ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఏటికొప్పాక లక్క బొమ్మల ఆకృతిలో ప్రదర్శించిన శకటం తృతీయ స్థానం సాధించి పురస్కారానికి ఎంపిక కావడం ఆనందంగా ఉంది. గౌ|| రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము గారికి, గౌ|| ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. NDA ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఏటికొప్పాక బొమ్మలకు ప్రాచుర్యం కల్పించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టింది. బొమ్మల తయారీకి అవసరమైన అంకుడు కర్ర చెట్ల పెంపకానికి ప్రోత్సాహం అంది స్తున్నాము. అతిథులకు ఇచ్చే జ్ఞాపికల్లో వీటిని చేర్చడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం ఏటికొప్పాక శకటం ఎంపిక చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున పంపించినందుకు గౌ|| ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
#vocalforlocal
❤️
👍
🙏
🇮🇳
✊
🫡
👏
👌
😂
💐
1.1K