Nara Chandrababu Naidu | CBN | TDP
Nara Chandrababu Naidu | CBN | TDP
February 3, 2025 at 10:55 AM
ప్రజలకు ఉపయుక్తమైన విధానాలతో ప్రభుత్వాలు సమాజాన్ని మార్చగలవు. ఉదాహరణకు 30 ఏళ్ళ  క్రితం తెచ్చుకున్న ఐటీ పాలసీ. దాని మూలంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారతీయులు తమ శక్తిని చాటుతున్నారు. 2047 నాటికి ప్రపంచవ్యాప్తంగా భారతీయులు అత్యంత ధనవంతులుగా స్థిరపడతారు. వారిని ఎవరూ ఆపలేరు. 11 ఏళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ గారు దేశాన్ని గర్వంగా తలెత్తుకునేలా తీర్చిదిద్దారు. మొన్న దావోస్ కు వెళ్ళినప్పుడు కూడా ప్రతి ఒక్కరూ భారత్ లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరిచారు. ప్రపంచంలో ప్రతి దేశమూ ఆర్థికంగా ఎదిగేందుకు అక్కడ ఉన్న భారతీయ సమాజం పైనే ఆధారపడి ఉంటుందంటే భారతీయలు ఎంత శక్తివంతంగా ఎదిగారో తెలుస్తోంది.
👍 ❤️ 🙏 😂 💛 🫡 ✌️ 😢 100

Comments