
Nara Chandrababu Naidu | CBN | TDP
February 8, 2025 at 04:24 PM
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించింది. మన ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా మన రాజధాని ఢిల్లీ అని గర్వంగా చెబుతాం. దేశ రాజధాని అయినా, రాష్ట్ర రాజధాని అయినా మన ఆత్మగౌరవానికి ప్రతీక. అక్కడ అన్ని విధాలుగా ప్రజలకు విస్తృత అవకాశాలు ఉండాలి. ఆశించిన వారందరూ రాజధానిపై ఆధారపడే పరిస్థితి రావాలి. అయితే ఇటీవలి కాలంలో ఢిల్లీ వాతావరణ కాలుష్యానికి, రాజకీయ కాలుష్యానికి నిలయంగా మారింది. ఈ కాలుష్యం దెబ్బకు తట్టుకోలేక ఢిల్లీని వదిలిపెట్టి చాలా మంది వెళ్లిపోతున్నారు. ప్రధాని నరేంద్రమోడీ సుస్థిరమైన ఢిల్లీ అభివృద్ధి నినాదంతో ముందుకు వచ్చారు. అందుకే ప్రజలు ఆకర్షితులయ్యారు. ఈ విజయం ప్రధాని నరేంద్రమోడీ సాధించినదే.
👍
❤️
🙏
✌️
😂
👏
💛
✌
🫡
☹️
210