Job Updates In Telugu
Job Updates In Telugu
January 22, 2025 at 02:27 AM
*ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ ప్రోగ్రాంకు ఆన్లైన్ పోర్టల్ విధానం ద్వారా ధరఖాస్తుల ఆహ్వానం* *యువతలో నైపుణ్యాభివృద్ధికి.. పీఎం ఇంటర్న్షిప్ పథకం* *డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ శ్రీ.Dr.S.వెంకటేశ్వర్, ఐఏఎస్, గారు,తిరుపతి జిల్లా* ప్రధాన మంత్రి ఇంటర్న్షిప్ ద్వారా రాబోయే 5 సంవత్సరాల్లో దేశంలోని టాప్ 500 కంపెనీలలో కోటి మంది యువతకు ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ ప్రారంభమైందని డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ శ్రీ.Dr.S. వెంకటేశ్వవార్, ఐ.ఏ.ఎస్, గారు తెలియజేశారు. దేశవ్యాప్తంగా యువతకు ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల్లో నైపుణ్యపరమైన శిక్షణతో కూడిన విద్యను 12 నెలలు పారిశ్రామిక అనుభవం అందించాలని సంకల్పించింది. 20 కంటే ఎక్కువ రంగాలలో యువతకు ఇంటర్న్షిప్ అవకాశాలు ఉన్నాయి. ఇంటర్న్షిప్ చేయాలనుకునే వారికి దేశవ్యాప్తంగా అవకాశాలు ఉంటాయి. *విద్యార్హతల విషయానికొస్తే*.. ఇంటర్న్షిప్ స్కీమ్కు అర్హత సాధించడానికి, దరఖాస్తుదారులు తమ ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసి ఉండాలి. ITI నుండి సర్టిఫికేట్, పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ నుండి డిప్లొమా లేదా BA, BSc, BCom, BCA, BBA, BPharm వంటి డిగ్రీని కలిగి ఉండాలి. ఆన్లైన్ లేదా దూరవిద్య ప్రోగ్రామ్లలో నమోదు చేసుకున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. *ఉచిత ఇన్సూరెన్స్ సౌకర్యం* భారత ప్రభుత్వం ద్వారా ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన మరియు ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కింద చేరే ప్రతీ ఒక్కరికీ బీమా కవరేజీ అందిస్తుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఈ క్రింది లింక్ లో నమోదు చేసుకోవాలి అని కోరారు. https://pminternship.mca.gov.in/ వెబ్సైట్ ద్వారా ఈ ఇంటర్న్షిప్ కోసం ఆధార్, బయోడేటాతో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని, ఎంపికైన వారికి 12 నెలలపాటు రూ.5 వేల చొప్పున అందిస్తారని, ఏకకాల గ్రాంటు కింద రూ.6 వేలు కూడా ఇస్తారు అని, ఇంటర్న్షిప్ జనవరి 10వ తేదీన ప్రారంభమైందని, జనవరి 21వ తేది ఆఖరు తేది అని తెలిపారు.*వయస్సు*: 21-24 ఏళ్ల మధ్య వయసున్న అభ్యర్థులే ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు అర్హులు అని, కావున తిరుపతి జిల్లా యువత ఈ సదవకాశాన్ని అందిపుచ్చుకోవాలని డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ శ్రీ Dr.S. వెంకటేశ్వర్, ఐఏఎస్ గారు, ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాల కొరకు ,9988853335, 9160912690, 81435 76866 నంబర్లను సంప్రదించగలరు. *Note*: పీఎం ఇంటర్న్షిప్ స్కీంకు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు క్యాండిడేట్ *ప్రొఫైల్లో తిరుపతి జిల్లాను కచ్చితంగా ఎంపిక చేసుకోండి*.
👍 ❤️ 😂 😮 🙏 9

Comments