TTD Updates ™
TTD Updates ™
February 13, 2025 at 10:38 AM
👆 *శ్రీనివాసమంగాపురంలో వేడుకగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం* తిరుపతి, 2025 ఫిబ్రవరి 13: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం గురువారం వేడుకగా జరిగింది. ఫిబ్రవరి 18 నుండి 26వ తేదీ వరకు ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం తెలిసిందే. ఉదయం 6.30 నుండి 10.30 గంటల వరకు ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించారు. ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. *2 పరదాలు విరాళం :* ఈ సందర్భంగా తిరుపతికి చెందిన శ్రీ పరదాల మణి రెండు పరదాలు, రెండు కురాళాలను ఆలయానికి విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మీ, ఏఈవో శ్రీ గోపీనాథ్, ఆలయ అర్చకులు శ్రీ బాలాజి రంగాచార్యులు, సూపరింటెండెంట్ శ్రీ రాజ్ కుమార్, ఇతర అధికారులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. *ఫిబ్రవరి 17వ తేదీ అంకురార్పణ* శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 17వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభ‌మ‌వుతాయి. ప్రతి రోజూ వాహన సేవలు ఉదయం 8 - 9 గం.ల మధ్య, రాత్రి 7 - 8 గం.ల మధ్య జరుగనున్నాయి. 23వ తేదీన సాయంత్రం 4 - 5 గం.ల మధ్య స్వర్ణ రథం, 25వ తేదీన ఉదయం 8.40 - 9.40 గం.ల మధ్యన రథోత్సవం, 26వ తేదీన ఉదయం 10 - 10.20 గం.ల మధ్య చక్రస్నానం జరుగనుంది. *బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :* *తేదీ* *18-02-2025* ఉదయం - ధ్వజారోహణం (మీన‌ల‌గ్నం) రాత్రి - పెద్దశేష వాహనం 19-02-2025 ఉదయం - చిన్నశేష వాహనం రాత్రి - హంస వాహనం 20-02-2025 ఉదయం - సింహ వాహనం రాత్రి - ముత్యపుపందిరి వాహనం 21-02-2025 ఉదయం - కల్పవృక్ష వాహనం రాత్రి - సర్వభూపాల వాహనం 22-02-2025 ఉదయం - పల్లకీ ఉత్సవం(మోహినీ అవతారం) రాత్రి - గరుడ వాహనం 23-02-2025 ఉదయం - హనుమంత వాహనం సాయంత్రం - స్వర్ణరథం, రాత్రి - గజ వాహనం 24-02-2025 ఉదయం - సూర్యప్రభ వాహనం రాత్రి - చంద్రప్రభ వాహనం 25-02-2025 ఉదయం - రథోత్సవం రాత్రి - అశ్వవాహనం 26-02-2025 ఉదయం - చక్రస్నానం రాత్రి - ధ్వజావరోహణం టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
🙏 ❤️ 💚 🕉️ 19

Comments