Unity Of GSWS GOVT Employees ( United Welfare  GSWS Govt Employees Forum)
Unity Of GSWS GOVT Employees ( United Welfare GSWS Govt Employees Forum)
February 12, 2025 at 02:03 AM
యూనిటీ ఆఫ్ జిఎస్డబ్ల్యూఎస్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తరపున ‌ ప్రభుత్వానికి మా విన్నపం ప్రమోషన్ చానళ్ల పేర్లతో, అనేక ఇతర సర్వీస్ మ్యాటర్స్ కి సంబంధించిన అంశాలతో, సంఘాలు నిజంగా సమస్యలు తీరుస్తున్నారో లేదో తెలియట్లేదు కానీ, డబ్బులుంటే పని అవుతుంది అని, మీటింగుల కోసం డబ్బులు వసూలు చేయడం, ప్రమోషన్ చానల్స్ కోసం డబ్బులు వసూలు చేయడం లాంటివి చేస్తున్నారు, మెంబర్షిప్ ల వరకు సమంజసమే, అసలు గతంలో ఏమి చేయనివారు కూడా మాకు ఆ మినిస్టర్ తెలుసు, ఈ మినిస్టర్ తెలుసు అంటూ వసూళ్ల కార్యక్రమం స్టార్ట్ చేశారు,ఇలాంటి వాటి వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు తప్పితే ఇంకొకటి ఏమీ లేదు, మా సమస్యలను అన్నిటినీ అర్థం చేసుకొని మీరే మా సచివాలయ ఉద్యోగుల యందు దయవుంచి అన్ని శాఖలకు సర్వీస్ రూల్స్ మీద, ప్రమోషన్ ఛానల్ మీద మాకు భరోసాని కల్పించి, మా భవిష్యత్తును ఉన్నతమైన బాట వేయాలని కోరుతున్నాం. సంఘాల ముసుగులో ఉన్న అవకాశవాదులకు అవకాశం కల్పించడం కంటే , ప్రభుత్వమే చొరవ తీసుకుంటే ఆ క్రెడిబిలిటీ మరియు క్రెడిట్ రెండు ప్రభుత్వానికి చెందుతాయి, మధ్యవర్తులు లేకుండా ఉంటారు, మాకు మంచి జరిగే అంశాల మీద నిర్ణయం తీసుకుంటే, ప్రభుత్వానికి మా ఒక నెల జీతాన్ని ఇవ్వడానికి ఉద్యోగులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు .. దయచేసి గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగ మిత్రులకు సంబంధించిన సర్వీస్ మ్యాటర్స్, మరియు ప్రమోషన్ చానల్ కి సంబంధించిన అంశాలపై మా అందరికీ న్యాయం జరిగేలాగా నిర్ణయం తీసుకోగలరని మనవి యునైటెడ్ వెల్ఫేర్ జి ఎస్ డబ్ల్యూ ఎస్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ UWGEA (236/24)
👍 😂 🙏 9

Comments