తిరుమల సమాచారం LaxmiTeluguTech
తిరుమల సమాచారం LaxmiTeluguTech
February 12, 2025 at 05:13 PM
👆 తిరుమలలో వైభ‌వంగా మాఘ పౌర్ణమి గరుడ సేవ తిరుమల, 2025 ఫిబ్రవరి 12: తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం సాయంత్రం మాఘ మాస పౌర్ణమి గరుడసేవ వైభ‌వంగా జరిగింది. రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
❤️ 🙏 2

Comments