GATE MASTERS ACADEMY
January 29, 2025 at 04:13 PM
ప్రియమైన సాయి చరణ్
పని వత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నవు అని విన్నాము.
మేము విన్నది నిజం కాకూడదు అని అనుకుంటున్నాము. ఒకవేళ పని వత్తిడి వల్లనే నువ్వు చనిపోయావు అన్నది నిజమే అయితే కనీసం AEE జాబ్ వదిలేసి మళ్లీ నువ్వు వదిలేసిన SOFTWARE జాబ్ వైపు వెళ్లి ఉండాల్సింది.
అందరికీ మా విన్నపం దయచేసి పని వత్తిడి వస్తే ఎదుర్కొని నిలబడండి. ప్రపంచంలో మనకి మన ప్రాణం కన్నా ఏది ఎక్కువ కాదు దేవుడు ఇచ్చిన నిండు ప్రాణాలు కాపాడుకోవడం ముఖ్యం.
పని వత్తిడి ని తట్టుకోలేక పోతే జాబ్ వదిలేసి బయటకురండి అంతే గాని విలువైన ప్రాణాన్ని మాత్రం విడువకండి.
నీ పవిత్ర ఆత్మ కి శాంతి చేకూరాలని కోరుతూ
ఓం శాంతిః