Gottipati Ravikumar | TDP
February 4, 2025 at 04:16 PM
పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం పర్యటనలో భాగంగా ఈరోజు గొల్లవానితిప్పలో కాలువపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెళ్లను నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నారాయణ నాయకర్ , తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు రామరాజు గార్లతో కలిసి పరిశీలించాను.. 2015లో స్థలం వృద్ధా కాకుండా రూ. 5 కోట్ల వ్యయంతో పైలెట్ ప్రాజెక్ట్ కింద కాలువపై సింగిల్ మెగావాట్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం జరిగింది.. కానీ గత వైసీపీ ప్రభుత్వం ఈ సోలార్ ప్లాంట్ నిర్వహణను గాలికి వదిలేయడంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిన సంగతిని తెలుసుకుని మార్గ మధ్యంలో ఉన్న ప్లాంట్ వద్ద ఆగి పరిశీలించాను. తక్షణమే నెడ్ క్యాప్ అధికారులతో ఫోన్ మాట్లాడి ప్లాంట్ నిర్వహణను చేపట్టి తిరిగి విద్యుత్ ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించాను.
#andhrapradesh #renewableenergy #solarenergy #gottipatiravikumar
❤️
👍
10