Gottipati Ravikumar | TDP

Gottipati Ravikumar | TDP

2.5K subscribers

Verified Channel
Gottipati Ravikumar | TDP
Gottipati Ravikumar | TDP
February 9, 2025 at 12:48 PM
ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈరోజు నిర్వహించిన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సహచర మంత్రివర్యులు శ్రీ డోలా బాల వీరాంజనేయస్వామి గారితో కలిసి పాల్గొన్నాను. ఈ సందర్భంగా విద్యా, రెవిన్యూ, పంచాయతీ రాజ్, వైద్య ఆరోగ్యం, వ్యవసాయ శాఖలతో సహా అన్ని శాఖల పనితీరుపై సమీక్షించడం జరిగింది. జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల పురోగతిపై చర్చించాము. అలాగే భవిష్యత్తులో ప్రకాశం జిల్లా అభివృద్ధి కోసం చేపట్టాల్సిన సమగ్ర కార్యాచరణపై చర్చించి, పలు నిర్మాణాత్మక సలహాలు, సూచనలు చేయడం జరిగింది. కచ్చితంగా ప్రకాశం జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. #andhrapradesh #prakasam #gottipatiravikumar #review
❤️ 2

Comments