
Vegesana Narendra Varma | Bapatla | TDP
February 3, 2025 at 03:26 PM
*ఉమ్మడి గుంటూరు - కృష్ణ జిల్లాల MLC ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో ఈరోజు బాపట్ల నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారి ఆధ్వర్యంలో నియోజకవర్గ విసృతస్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది.రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాయకులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కలసికట్టుగా పని చేసి,కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు పిలుపున్నిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన,బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.*