Vegesana Narendra Varma | Bapatla | TDP
February 5, 2025 at 05:04 PM
*బాపట్ల డిపో పరిధిలోని కొత్త రూట్లలో బస్సులు ఏర్పాటు చేయాలని వినతి.*
*రవాణా శాఖ మంత్రి శ్రీ రాంప్రసాద్ రెడ్డి గారిని కోరిన బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు*
బాపట్ల డిపో పరిధిలో కొత్త రూట్లలో బస్సుల ఏర్పాటుకు కృషి చేయాలని రవాణా శాఖ మంత్రి శ్రీ రాంప్రసాద్ రెడ్డి గారిని బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు సచివాలయంలో మంత్రి ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి కోరారు.
2022లో కొత్తగా ఏర్పాటైన బాపట్ల జిల్లాకు బాపట్ల జిల్లా కేంద్రంగా మారిందని, అయితే ప్రజల నుంచి డిమాండ్ పెరిగినప్పటికీ జిల్లా హెడ్ క్వార్టర్స్ అంటే బాపట్ల నుంచి స్టేట్ హెడ్ క్వార్టర్స్, ఇతర ముఖ్య ప్రాంతాలకు బస్సుల ఫ్రీక్వెన్సీ, సర్వీసుల ఫ్రీక్వెన్సీని ఇంతవరకు పెంచలేదన్నారు.
కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో ప్రజలకు మెరుగైన రవాణా సేవలు కల్పించాలని మంత్రి గారిని ఎమ్మెల్యే గారు కోరారు. రవాణా శాఖ మంత్రి సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.