KTR - Kalvakuntla Taraka Rama Rao
KTR - Kalvakuntla Taraka Rama Rao
February 1, 2025 at 03:25 AM
గులాబీ దళమంతా సిద్ధం.. తప్పదిక యుద్ధం కాంగ్రెసోళ్లు వస్తే ఏదో చేస్తరని ప్రజలు ఆశపడ్డరు. ఇప్పుడు గోసపడుతున్నరు. అప్పుడు ఇట్లనే అయితదని చెప్పినం. రైతుబంధుకు రాంరాం.. దళితబంధుకు జైభీమ్‌ అంటరని.. మిమ్మల్ని ముంచుతరని నాడే చెప్పిన. తులం బంగారం ఇస్తామంటే వీళ్ల సంగతేందో చూద్దామని ఓట్లేసిండ్రు. ఇప్పుడు మొదటికే మోసమైందని బాధపడుతున్నరు. కైలాసం ఆటల పెద్దపాము మింగినట్టున్నది ప్రజల పరిస్థితి.. ఎటుపడితే అటు నమ్మి ఓట్లేస్తే ఏమైందో ప్రజలకు తెలిసిపోయింది. ఒక్క రైతుబంధే కాదు.. అన్నీపోయి గంగల కలిసినయ్‌. కరెంట్‌ కథ మళ్లీ మొదటికి వచ్చింది. మార్చి, ఏప్రిల్‌లో ఏం జరుగుతదో తెలియకుండా ఉన్నది. కనీసం మంచినీళ్లు కూడా సరిగ్గా ఇస్తలేరు. ఇదేందని అడిగే నాథుడు లేడు. ఎవరన్న గట్టిగ నిలదీస్తే పోలీసులకు పట్టిస్తున్నరు. ఇదేనా రాజ్యం ? ఇట్లనే ఉంటదా రాజ్యం? మీకు ముఖ్యమంత్రి, మంత్రి పదవులు ఎందుకు? పది మందికి మేలు చేయడానికా? లేక తమాషా చేయడానికా? ఓపిక పట్టేకాడికి పట్టినం. ఇప్పటికి 14 నెలలైంది. ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేది లేదు. ప్రభుత్వం మెడలు వంచేందుకు ప్రత్యక్ష పోరాటాల కోసం కార్యకర్తలు సిద్ధంగా ఉండాలె. - బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.
👍 ❤️ 🙏 30

Comments