CM Ramesh

CM Ramesh

7.3K subscribers

Verified Channel
CM Ramesh
CM Ramesh
January 29, 2025 at 02:11 AM
*ఏకో ఫ్రండ్లీ పార్కు ప్రారంభోత్సవంలో తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి,మెగాస్టార్ చిరంజీవి గారితో కలసి పాల్గొన్న రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సీఎం రమేష్*. రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ దేవస్థానం మార్గంలోని ప్రొద్దుటూరు గ్రామంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రూపుదిద్దుకున్న ఎక్స్‌పీరియం పార్క్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, మెగాస్టార్ చిరంజీవిగారు మరియు ఇతర ప్రముఖులు, ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్న కలసి రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సీ.ఎం రమేష్ గారు పాల్గొన్నారు.ప్రపంచస్థాయి ప్రమాణాలతో 150 ఎకరాల్లో ఈ పార్కును తీర్చిదిద్దారు అని దీనిలో 25వేల జాతుల మొక్కలు ఉన్నాయి.85 దేశాల నుంచి దిగుమతి చేసుకున్న అరుదైన వృక్షాలు, చెట్లు ఉన్నాయి.ఎక్స్ పీరియం పార్కులో రూ. లక్ష నుంచి రూ.3.5కోట్ల విలువ చేసే అరుదైన వృక్షాలను అందుబాటులో ఉంచారు.దీనిలో వివిధ ఆకృతుల్లో రాక్ గార్డెన్ను సిద్ధం చేశారు. 1500 మంది కూర్చునేలా యాంఫీ థియేటర్ను ఏర్పాటు చేశారు. రూ.150 కోట్ల విలువైన మొక్కలు, చెట్లు, వృక్షాలు కలిగిన ఏకైక పర్యాటక ప్రాంతంగా ఇది నిలిస్తుంది అని నిర్వాహకులు పేర్కొన్నారు.రాందేవ్ రావ్ గారు ఆరున్నరేళ్ల పాటు శ్రమించి ఎక్స్ పీరియంను తీర్చిదిద్దినందుకుగాను నాయకులు తో కలసి సీ.ఎం రమేష్ గారు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసారు. *అనకాపల్లి ఎం.పీ క్యాంపు కార్యాలయం, పూడిమడక రోడ్,అనకాపల్లి*.
❤️ 🙏 👍 👏 16

Comments