
CM Ramesh
February 16, 2025 at 09:17 AM
చిన్నప్పుడు ప్రొద్దుటూరు ప్రభుత్వ పాఠశాలలో నాకు విద్యాబుద్ధులు నేర్పిన మా బాలనారాయణ రెడ్డి మాస్టారు నేడు వారి కుటుంబ సభ్యులతో నన్ను కలవడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల రోజుల నాటి మధురమైన జ్ఞాపకాలను స్మరించుకున్నాం. మాస్టారు నేర్పిన విలువలు, క్రమశిక్షణ, మరియు శ్రమతో కూడిన మార్గదర్శకం జీవితంలో నన్ను ముందుకు నడిపించాయి.
గురువుల ఆశీస్సులే విద్యార్థుల భవిష్యత్తుకు పునాది. వారి క్షేమ సమాచారాన్ని తెలుసుకోవడం, ఆనాటి అనుబంధాన్ని మళ్లీ గుర్తుచేసుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. గురువు గారి స్ఫూర్తితో నడుస్తూ సమాజానికి సేవ చేయడమే నిజమైన గురుదక్షిణ అని నా ప్రగాఢ నమ్మకం.
#cmramesh
❤️
🙏
👍
👏
11