
Govt Updates✅
February 4, 2025 at 04:45 AM
ఉదయం 5 గంటలకు, 6 గంటలకు పింఛన్ల పంపిణీ మొదలు పెట్టాల్సిన అవసరం లేదని సిఎం స్పష్టం చేశారు. ఉదయం 7 గంటలకు పింఛన్ల పంపిణీ మొదలుపెట్టి. సాయంత్రం 6 లోగా పంపిణీ పూర్తి చేయాలని సూచించారు. పింఛను పంపిణీ సక్రమంగా జరగాలన్నదే తన ఆలోచన అని. ఆ పేరుతో అనవసర నిబంధనలతో ఉద్యోగులను ఇబ్బందిపెట్టాల్సిన అవసరం లేదని సిఎం అన్నారు. అయితే ఇదే సమయంలో ఇంటి వద్దనే పింఛను అనే విధానం పక్కాగా అమలు కావాలని సిఎం సూచించారు. ఇంటి వద్ద కాకుండా....పొలంలోనో, ఆసుపత్రిలోనో, ఇతర ప్రాంతంలోనో పింఛను పంపిణీ చేసినట్లు తేలితే...వాటికి గల కారణాలను విశ్లేషించాలన్నారు. ప్రజల నుంచి అభ్యంతరం లేనంత వరకు ఇలాంటి చోట్ల వెసులుబాటు కల్పించాలని సిఎం అన్నారు. అయితే పింఛను పంపిణీ విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు...లబ్ధిదారులతో గౌరవంగా, సౌకర్యవంతంగా వ్యవహరించాలని సూచించారు