
SURYAA NEWS PAPER(ND)
February 15, 2025 at 09:30 AM
అలిపిరి నడకదారిలో భక్తులకు గుంపులుగా అనుమతి
చిరుత సంచారంతో ప్రత్యేక జాగ్రత్తలు
నడక మార్గంలో
భక్తులకు సూచనలు చేస్తున్న విజిలెన్స్ సిబ్బంది
తిరుపతి, తిరుమల పరిధిలో చిరుతల సంచారం నేపథ్యంలో టీటీడీ అధికారులు పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టారు. విజిలెన్స్ సిబ్బంది గస్తీని ముమ్మరం చేశారు. అలిపిరి నుంచి తిరుమలకు నడక మార్గంలో వెళ్లే భక్తులను ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు యథావిధిగా అనుమతిస్తున్నారు. అనంతరం గుంపులుగా వదులుతున్నారు. ఒక్కో బృందంలో 70 నుంచి 100 మంది ఉండేలా విజిలెన్స్ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. 12 సంవత్సరాలలోపు ఉన్న చిన్నారులను మధ్యాహ్నం నుంచి అనుమతించడం లేదు. రాత్రి 9.30 గంటల తరువాత అలిపిరి నడక మార్గాన్ని మూసివేస్తున్నారు.
👍
1