SURYAA NEWS PAPER(ND)
SURYAA NEWS PAPER(ND)
February 15, 2025 at 09:35 AM
జీబీఎస్ వైరస్‌పై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు జీబీఎస్ వైరస్‌పై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. కేవలం 17 కేసులు మాత్రమే నమోదయ్యాయన్నారు. మరణాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నామని.. వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. బర్డ్ ఫ్లూ ఎక్కడా మనుషులకు సంక్రమించలేదని.. చికెన్ విషయంలో ఇప్పటికే మంత్రి అచ్చెన్నాయుడు క్లారిటీ ఇచ్చారని తెలిపారు.కేంద్ర బడ్జెట్ వికసిత్ భారత్ సాధన దిశగా ఉందన్నారు. వైద్య, ఆయుష్ మీద 12 శాతం నిధులు పెంచామన్నారు. వైద్యం కోసమే లక్ష కోట్లు బడ్జెట్‌లో కేటాయించారని అన్నారు. క్యాన్సర్‌కు సంబంధించిన 30 రకాల మందులపై జీఎస్టీ, ఇతర ట్యాక్సులు తగ్గించామన్నారు. 75 వేల మెడికల్ సీట్లు పెంచే దిశగా వెళ్తున్నామన్నారు. ఏపీకి పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతోందని.. అన్ని వర్గాల అభ్యున్నతి కోసం బడ్జెట్‌లో కేటాయింపులు జరిగాయని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు.
👍 1

Comments