SURYAA NEWS PAPER(ND)
February 15, 2025 at 03:31 PM
బీసీ కులగణనపై దేశవ్యాప్తంగా ఉద్యమం!
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీలో కీలక చర్చ జరిగినట్లు తెలుస్తోంది. బీసీ కులగణనపై దేశవ్యాప్తంగా ఉద్యమం చేయాలని ఈ భేటీలో నిర్ణయించారు. కేంద్రం మీద ఒత్తిడి పెంచే పనిలో కాంగ్రెస్, మార్చి 10న ఇండియా కూటమి ఎంపీలతో పార్లమెంట్‌లో నిరసన చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇండియా కూటమి సీఎంలతో రేవంత్ సమన్వయం చేయనున్నారు. ఇందుకు ఇండియా కూటమి నేతలతో రాహుల్ సంప్రదింపులు చేస్తున్నారు.