
SURYAA NEWS PAPER(ND)
February 15, 2025 at 03:38 PM
వాట్సాప్‌లో మరో సరికొత్త ఫీచర్
వాట్సాప్ మాతృ సంస్థ మెటా మరో ప్రకటన చేసింది. వాట్సాప్‌లో త్వరలోనే మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తాజాగా వెల్లడించింది. వినియోగదారులు తమ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లను నేరుగా తమ వాట్సాప్ ఖాతాలకు లింక్ చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం iOS కోసం బీటాలో ఉన్నట్లు తెలిపింది.ఈ కొత్త ఫీచర్ సాయంతో యూజర్లు నచ్చిన విధంగా చాట్ థీమ్, చాట్ బబుల్‌ని మార్చుకోవచ్చు. ఇందులో 30 రకాల వాల్‌పేపర్ ఆప్షన్లు ఉన్నాయి. కావాలంటే కెమెరాతో బంధించిన ఫొటోలనూ చాట్ థీమ్‌గా పెట్టుకోవచ్చు. సాధారణంగా వాట్సప్‌లో మనం పెట్టే మెసేజ్‌లు ఆకుపచ్చ (Green) రంగుల్లో.. మనకు పంపే మెసేజ్‌లు తెలుపు (White) రంగులో కనిపిస్తాయి. వీటిని కూడా ఇకపై నచ్చిన రంగులకు మార్చుకోవచ్చు. యూజర్ల అనుభవాన్ని మెరుగపరిచి, చాటింగ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు వాట్సాప్ ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ థీమ్ మీకు మాత్రమే కనిపిస్తుంది. వాట్సప్ ఛానల్ నిర్వహిస్తున్నవారు కూడా ఈ ఫీచర్‌ని వినియోగించుకోవచ్చు.ఇక Settings>Chats>Default chat theme ని ఎంచుకొని ఈ థీమ్‌ని ఛేంజ్ చేయొచ్చు. iOS డివైజ్ అయితే వాట్సాప్ ఓపెన్ చేస్తే అందులో పైన స్క్రీన్‌లో చాట్ నేమ్ ఆప్షన్ కన్పిస్తుంది. దీని ద్వారా యాపిల్ డివైజెస్‌లో వాట్సాప్ చాట్ థీమ్స్‌ను మార్చుకోవచ్చు. ఇప్పటికే వాట్సప్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. యాప్‌ని అప్‌డేట్ చేసుకొని మీరు కూడా దీనిని ట్రై చేయండి.