Harish Rao Thanneeru

6.6K subscribers

Verified Channel
Harish Rao Thanneeru
February 10, 2025 at 12:28 PM
అన్నా, హరీశన్నా.. మా ఇండ్లు, దుకాణాలు కూలగొడుతున్నారు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ కారుకు అడ్డు వచ్చిన బాధితులకు భాసటగా నిలిచిన మాజీ మంత్రి హరీష్ రావు గండిపేట మండలం కాళీ మందిర్ వద్ద పేదల షాపులను కూలగొడుతున్న మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి హరీశ్ రావు. పేదల ఇండ్లు, దుకాణాలు అకస్మాత్తుగా కూలగొడితే ఎట్ల బతుకుతారు అంటూ మండిపడ్డ హరీశ్ రావు. బాధితులకు ధైర్యం చెప్పి, అక్కడి నుంచే బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కమిషనర్ తో ఫోన్లో మాట్లాడిన హరీశ్ రావు. ఇప్పటికే హైడ్రా పేరిట పేదల బతుకులు కూల్చారు. ఇప్పుడు దుకాణాలు కూల్చితే బతుకు దెరువు ఎట్లా అంటూ ప్రశ్నించిన హరీశ్ రావు. 20,30 ఏళ్ల నుండి ఇక్కడి దుకాణాల పైనే ఆధారపడి జీవిస్తున్న వారి ఉపాధి పై దెబ్బకొట్టడం దుర్మార్గం అని మండిపడ్డ హరీష్ రావు. హరీశ్ రావు నిలదీయడంతో హుటాహుటిన ఘటన వద్దకు చేరుకున్న కమిషనర్. కూల్చివేతలు నిలిపి వేసి అక్కడి నుంచి వెళ్లిపోయిన మున్సిపల్ సిబ్బంది. తమ పక్షాన నిలిచిన హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపిన స్థానికులు.
👍 ❤️ 6

Comments