Pranavananda Das
January 24, 2025 at 07:18 AM
*రేపు షట్టిల ఏకాదశి* (25th January)
హరే కృష్ణ..
*భక్తి జనని అయిన ఏకాదశి యొక్క నియమాలను తెలుసుకుందాం*
✓ ధాన్యాలు, పప్పులు, శనిగలు, మక్కజొన్న, కూరగాయలలో(గొకర్కాయ, చిక్కుడుకాయ లాంటివి), బటాని వంటివి తినకూడదు
✓*పండ్లు, పాలు, కాజు, బాదం, పిస్తా, కిస్మిస్ వంటి డ్రై ఫ్రూట్స్, కంద మూలాలు, సగ్గు బియ్యం, *సామలు* లాంటివి మనం తినవచ్చు*
/ తులసి పత్త్రిన్ని/ఆకులని ఏకాదశి మరియు ద్వాదశి(ఏకాదశి తరువాత రోజున) తెంపకూడడు
✓ ఏకాదశి యొక్క ముఖ్య ఉద్దేశం, మన శరీరం యొక్క అవసరాలను తగ్గించి, శ్రవణం, కీర్తనం, హరి నామ స్మరణం ఎక్కువ చేయడం.
✓ మన రోజును కృష్ణుడి యొక్క విగ్రహాన్ని లేదా ప్రతిమను పూజించడంతో మొదలుపెట్టడం చాలా మంచిది.
ధూపం, దీపం, తులసి పత్రం(ఏకాదశి ముందు రోజు తీసినవి), పండ్లు, పూలు సమర్పించి ఆ శ్రీ విష్ణువుని కృప కొరకు ప్రార్థించండి.
✓ హరే కృష్ణ హరే కృష్ణ | కృష్ణ కృష్ణ హరే హరే || హరే రామ హరే రామ రామ రామ హరే హరే ॥ అనే ఈ మహా మంత్రాన్ని ఎంత కుదిరితే అంత జపించండి.
✓ ఒక గమనిక ఏమిటంటే మనం ఏకాదశి రోజున మాంసము, చేపలు, గుడ్లు, పుట్ట గొడుగులు, మద్యం, ఉల్లిపాయ, వెల్లుల్లి, మత్తుపదార్తాలు(సిగరెట్, తంబాకు) మరియు ఇతర తామసిక పదార్థాలను సేవించకూడడు.
✓ ద్వాదశి (ఏకాదశి తరువాత రోజు) ప్రొదున్నే లేచి స్నానంచేసి, విష్ణు మూర్తిని ఆరాధించి, ఉపవాసాన్ని పారణ సమయమున (ఉపవాసము విడిచిపెట్టు సమయం) విడిచిపెట్టాలి, ఈ సమయం ప్రతి ఏకాదశికి మారుతుంది.
శ్రీమాన్ ప్రణవానంద ప్రభూజీ యొక్క ప్రవచనాల గురించి మరియు రాబోయే కార్యక్రమాల గురించి మరిన్ని వివరాల కోసం ఈ వాట్సాప్ ఛానెల్ ని ఫాలో అవ్వండి 👇🏻👇🏻
https://whatsapp.com/channel/0029VaBLnhz8Pgs8IXNpoD2b
🙏
❤️
👍
89