M.S RAJU | TDP

3.4K subscribers

Verified Channel
M.S RAJU | TDP
February 9, 2025 at 06:13 AM
*10న మడకశిరలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక* *- కార్యక్రమంలో పాల్గొననున్న జిల్లా కలెక్టర్, అధికార యంత్రాంగం* *- నియోజకవర్గ ప్రజలంతా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి* *మడకశిర :* మడకశిర నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న పలు రకాల సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రజాసమస్యల పరిష్కార వేదికను మడకశిర తహసీల్దార్(ఎం.ఆర్.ఓ.) కార్యాలయంలో సోమవారం అనగా 10-02-2025 ఉదయం 9AM గంటల నుండి మధ్యాహ్నం 1PM గంటల వరకు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గారు టీఎస్ చేతన్ గారు, ఇతర అధికార యంత్రాంగం మొత్తం హాజరవుతున్నారు. నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను ఈ పరిష్కార వేదికకు హాజరై పరిష్కరించుకోవాలని, ఈ చక్కని సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మీ సమస్యలపై అర్జీలు తీసుకుని అధికారులకు ఇచ్చి తగు పరిష్కారాలు పొందాలని కోరుతున్నాను. *ఎం.ఎస్.రాజు,* *- మడకశిర శాసనసభ్యులు, టీటీడీ పాలకమండలి సభ్యులు.*
❤️ 👍 2

Comments