M.S RAJU | TDP
February 10, 2025 at 12:07 PM
*గోకులం షెడ్డు, నీటి బోరు ప్రారంభించిన ఎం.ఎస్.రాజు, తిప్పేస్వామి*
అమరాపురం మండలం, హేమావతి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన నీటిబోరు, గోకులం షెడ్డును మడకశిర శాసనసభ్యులు, టీటీడీ పాలకమండలి సభ్యులు ఎం.ఎస్.రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం యువతను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గోకులం షెడ్లను రాయితీల మీద ఇస్తోంది. దీనిలో భాగంగా హేమావతి గ్రామంలో లబ్ధిదారులు ఏర్పాటు చేసుకున్న గోకులం షెడ్డును ఎం.ఎస్.రాజు ప్రారంభించి, లబ్ధిదారులను అభినందించారు. గోకులం షెడ్డులో గోసేవ చేసుకున్నారు. బోరు ద్వారా ఏర్పాటు చేసిన కుళాయి తిప్పి పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మూర్తి, అమరాపురం మండల కన్వీనర్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.