Kavitha Kalvakuntla
February 6, 2025 at 12:36 PM
ఎక్స్ లో ఎంఎల్సీ కవిత గారు
రేవంత్ సర్కారు నిర్లక్ష్యం.. 'పాలమూరు'కు శాపం
14 నెలలుగా పాలమూరు ఎత్తిపోతలను కోల్డ్ స్టోరేజీలో పెట్టిన రేవంత్ సర్కారు.. ప్రాజెక్టుకు అనుమతుల సాధనను గాలికొదిలేసింది. కేసీఆర్ హయాంలో సాధించిన పర్యావరణ అనుమతులను న్యాయవివాదాల సుడి నుంచి బయటకు తేలేకపోయింది. ఎంతో ముందు చూపుతో కేసీఆర్ పాలమూరుకు 90 టీఎంసీల నికర జలాలు కేటాయించి ప్రాజెక్టును గట్టెక్కించే ప్రయత్నం చేస్తే.. ఆ విషయాన్ని కేంద్రానికి సరిగా చెప్పలేక తుది అనుమతులను ఇంకింత సంక్లిష్టం చేసింది. వెరసి.. కృష్ణా జలాల నీటి కేటాయింపులు తేలేవరకు పాలమూరు - రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలేమని పార్లమెంట్ సాక్షిగా కేంద్రం తేల్చిచెప్పింది. నల్లమల బిడ్డనని చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు.. పాలమూరు ప్రాజెక్టు విషయంలో మీ చిత్తశుద్ధి ఏపాటిదో ఈ రోజు తేలిపోయింది.
👍
❤️
13