UPSC Telugu Updates
February 17, 2025 at 07:04 PM
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రోస్టర్ పాయింట్ల కేసు 2024 : డిసెంబర్ 2023 : ఏపీపీఎస్సీ వారు గ్రూప్ 2 నోటిఫికేషన్ ను డిసెంబర్ 7 2023 లో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అని విడుదల చేశారు మరి డిసెంబర్ 3వ వారంలో డీటెయిల్డ్ నోటిఫికేషన్ అని విడుదల చేశారు జనవరి 2024 : జనవరి 5/ 2024 న కొంత మంది అభ్యర్థులు రోస్టర్ పాయింట్ల చాల తప్పులు వున్నాయి అని కేసు వేశారు రోస్టర్ పాయింట్ల కరెక్ట్ చేశాక ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించాలి అని ఏపీపీఎస్సీ వారిని కోరారు, ఫిబ్రవరి 2024 : ఫిబ్రవరి 3వ వారంలో రోస్టర్ పాయింట్లు గూర్చి న్యాయస్థానం కు వెళ్లారు ఆ సమయంలో ప్రిలిమ్స్ పరీక్ష రోస్టర్ పాయింట్లు సరి చేసి నిర్వహించాలి అని కోరారు కానీ పట్టు పట్టి ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు అప్పట్లో చాలా మంది ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా వేయాలన్న వినకుండా నిర్వహించారు ఫైనల్ గా ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు ఏప్రిల్ 2024 : ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు రాక ముందు కూడా రోస్టర్ పాయింట్లు గూర్చి ఇంకోసారి వివరించారు ఉగాది పండుగ తరువాత ఫలితాలు వచ్చాయి ఆ సమయంలో మరో రోస్టర్ పాయింట్ల కేసు వేశారు, జూన్ 2024 : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోస్టర్ పాయింట్లు గూర్చి కేసు వేసిన వారు గౌరవ మంత్రి శ్రీ నారా లోకేష్ గారిని కలిసి గ్రూప్ 2 నోటిఫికేషన్ లో వున్న రోస్టర్ పాయింట్ల తప్పుల గూర్చి చెప్పారు నారా లోకేష్ గారు న్యాయస్థానంలో వున్న విషయం కాబట్టి న్యాయస్థానం తీర్పు బట్టి స్పందిస్తాం అన్నారు, సెప్టెంబర్ 2024 : ఈ సమయంలో మరో సారి గ్రూప్ 2 రోస్టర్ పాయింట్ల కేసు వాదనలు జరిగాయి సెప్టెంబర్ 11న ఏపీపీఎస్సీ లో గ్రూప్ 2 రోస్టర్ పాయింట్లు కేసు గూర్చి చర్చలు జరిగాయి నవంబర్ 2024 : గ్రూప్ 2 రోస్టర్ పాయింట్ల కేసు మరో సారి వాదనలు జరిగాయి గౌరవ న్యాయస్థానంలో, ఫిబ్రవరి 2025 : ఫిబ్రవరి లో రోస్టర్ పాయింట్లు గూర్చి వాదనలు జరిగి ఫిబ్రవరి 18న వాయిదా వేశారు, ఈ కేసు ఇంత స్ట్రాంగ్ అవ్వడానికి కారణం రోస్టర్ పాయింట్లు సరిగ్గా ఇవ్వకపోవడం ఉదాహరణ : zone 4 లో 8 డిప్యూటీ తహసీల్దార్ పోస్ట్స్ వుండగా అందులో 5 ఉమెన్ కు వెళ్లాయి మిగిలిన 3 జనరల్ & తదితులకు వచ్చాయి, ఇలా వుంటే ఎంత బాగా చదివిన గెజిటెడ్ కెడర్ వుద్యోగం రాదు మిగిలిన జోన్స్ లో అమ్మాయిలకు అన్యాయం చేయడం జనరల్ అభ్యర్థులకు తక్కువ ఖాళీలు ఇవ్వటం అర్థం పర్థం లేకుండా రోస్టర్ పాయింట్ల తయారు చేసి ఇచ్చారు ఇలానే వుండి పరీక్ష రాస్తే ఏ ఒక్కరికి న్యాయం జరగదు అలానే మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తే తరువాత అయిన కేసు వేస్తారు అప్పుడు రిజల్ట్ హోల్డ్ అవుతుంది మరో 1999 డీఎస్సీ అవుతుంది, ఫిబ్రవరి 18న కేసు వాదనలు వస్తాయి స్టే పడే అవకాశాలు వున్నాయి అంటున్నారు, అప్పుడు ag తరుపున వారు ఇంకో డివిజన్ బెంచ్ కు వెళ్ళే అవకాశం కూడా వుంది, ఏది ఏమైనా కేసు తీర్పు కోసం వేచి చూడాలి అలానే గ్రూప్ 1 2023 కూడా రోస్టర్ పాయింట్ల తప్పులు వున్నాయి అని కొంత మంది అంటున్నారు ఏం అవుతుందో చూడాలి... ఇట్లు మురళి నారాయణ్
👍 🙏 13

Comments