Sripal Reddy Pingili
Sripal Reddy Pingili
February 23, 2025 at 04:00 PM
గురుకుల పాఠశాలల పని వేళలు మార్పు చేయుటకు మరియు ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు ఇవ్వడానికి సీఎం అంగీకారం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గురుకులాల పాఠశాల పనివేళలు గత విద్యా సంవత్సరం మాదిరిగా ఉదయం 9 గంటల కు ప్రారంభమయ్యే విధంగా టైం టేబుల్ మార్పు చేయడానికి సీఎం అంగీకరించడం జరిగింది నేడు గౌరవ ముఖ్యమంత్రి గారి నివాసంలో మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి మాజీ అధ్యక్షులు పేరి వెంకట్ రెడ్డి మరియు పూర్వ ప్రధాన కార్యదర్శి గుండు లక్ష్మణ్ గార్లు కలవడం జరిగింది గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల పనివేలలు వలన ఎదుర్కొంటున్న సమస్యలు వారికి వివరించగా వారు టైం టేబుల్ మార్పు చేయడానికి అంగీకరించారు ఉద్యోగ ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు అందించాలని వీటిని మోడల్ గురుకుల ఎయిడెడ్ ఉపాధ్యాయులకు అందించాలని అలాగే మోడల్ గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులకు 010 పద్దు ద్వారా వేతనాలు అందించాలని కోరగా వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తానని హామి ఇచ్చారు అదే విధంగా సమగ్ర శిక్ష ఉద్యోగులకు పే స్కేల్స్ ఇవ్వాలని కోరగా బడ్జెట్ సమీక్షించి వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి అమలు చేస్తానని గౌరవ ముఖ్యమంత్రి గారు హామి ఇచ్చారు పలు సమస్యలు పై సానుకూలంగా స్పందించి ఉత్తర్వులు ఇవ్వడానికి అంగీకరించినందుకు గౌరవ ముఖ్యమంత్రి యెనుముల రేవంత్ రెడ్డి గారికి PRTUTS రాష్ర్ట సంఘం పక్షాన కృతజ్ఞతలు పులగం దామోదర్ రెడ్డి రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి PRTUTS
🙏 👍 👏 17

Comments