
Gottipati Ravikumar | TDP
February 21, 2025 at 01:28 PM
బల్లికురవ మండలం, వైదన గ్రామంలో ఈరోజు రూ. 20 లక్షల నిధులతో చేపట్టిన సీసీ రోడ్లు, సైడ్ డ్రెయిన్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నాను.అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వైదన గ్రామంలో రూ. 50 లక్షల CSR ఫండ్స్‌తో ముస్లిం కమ్యూనిటీ హాలు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశాను. అలాగే దివ్యాంగులకు ఉచితంగా ఎలక్ట్రిక్ ట్రై సైకిల్స్ పంపిణీ చేయడం సంతృప్తిని కలిగించింది. దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం సదా సిద్ధంగా ఉంటుందని మాట ఇస్తున్నాను. అనంతరం గ్రామంలో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని, త్వరితగతిన పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. పల్లెలు బాగుపడాలి..ప్రజలంతా ఏ సమస్యల్లేకుండా సంతోషంగా ఉండాలన్న సీఎం చంద్రబాబు గారి ఆలోచన మేరకు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది.
#andhrapradesh #addanki #gottipatiravikumar #idhimanchiprabhutvam
❤️
👍
3