Bandi Sanjay Kumar
                                
                                    
                                        
                                    
                                
                            
                            
                    
                                
                                
                                February 26, 2025 at 09:23 AM
                               
                            
                        
                            మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి, పూజలు నిర్వహించడం జరిగింది.
దేశ, రాష్ట్ర ప్రజలందరూ రాజన్న కృపతో అష్టైశ్వర్యాలు, సుఖశాంతులతో కష్టాలన్నీ తొలగి ప్రశాంతంగా కలకాలం ఉండాలని వేడుకున్నాను. ఇటీవల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్న అనంతరం దేశమంతా ఒక చర్చ కొనసాగుతుంది, దేశవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజమంతా ఒక్కసారైనా వేములవాడ పుణ్యక్షేత్రానికి వెళ్లి రాజన్నను దర్శించుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. వేములవాడ ఆలయ పవిత్రత, శక్తిని నరేంద్ర మోడీ గారు దేశానికి తెలియజేశారు.
హర హర మహాదేవ 
#vemulawada #omnamahshivaya #mahashivratri
                        
                    
                    
                    
                    
                    
                                    
                                        
                                            🙏
                                        
                                    
                                        
                                            ❤️
                                        
                                    
                                        
                                            👍
                                        
                                    
                                        
                                            🕉️
                                        
                                    
                                        
                                            😢
                                        
                                    
                                        
                                            🚩
                                        
                                    
                                    
                                        28