UPSC Telugu Updates
February 28, 2025 at 10:55 AM
*ఏపి బడ్జెట్ 2025 2026* : 3.22 లక్షల కోట్ల రూపాయలతో ఏపీ బడ్జెట్‌ను రూపొందించినట్లు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు తెలిపారు, ఇందులో వ్యవసాయానికి రూ.48,340 కోట్లు, ( వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు గారు), వయబులిటీ గ్యాఫ్‌ ఫండ్‌ రూ.2 వేల కోట్లు, ఎస్సీల గృహ నిర్మాణానికి రూ.50 వేలు, ఎస్టీల గృహ నిర్మాణానికి రూ.70 వేలు, ఎన్టీఆర్‌ వైద్య భరోసాకు రూ.31,613 కోట్లు కేటాయించారు, *డిపార్ట్మెంట్ వైజ్ బడ్జెట్ అల్లోకేషన్* : 1-పాఠశాల విద్యకు రూ.31,806 కోట్లు 2-వైద్యారోగ్య శాఖకు రూ.19,260 కోట్లు 3-పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.18,848 కోట్లు 4-జలవనరుల అభివృద్ధికి రూ.18,020 కోట్లు 5-మున్సిపల్ అండ్ పట్టణాభివృద్ధికి రూ.13,862 కోట్లు 6-విద్యుత్ శాఖకు రూ.13,600 కోట్లు 7-వ్యవసాయానికి రూ.11,636 కోట్లు 8-సాంఘిక సంక్షేమానికి రూ.10,909 కోట్లు 9-ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు రూ.10,619 కోట్లు 9-రవాణా శాఖకు రూ.8,785 కోట్లు 9-ఎస్సీ, ఎస్టీ, బీసీ స్కాలర్‌షిప్పులకు రూ.3,377 కోట్లు 10-పురపాలక శాఖకు రూ.13,862 కోట్లు, 11-స్వచ్ఛ ఆంధ్ర కోసం రూ.820 కోట్లు 12-ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ రాయితీలు రూ.300 కోట్లు 13-ఆదరణ పథకం కోసం రూ.1000 కోట్లు 14-మనబడి పథకం కోసం రూ.3,486 కోట్లు 15-తల్లికి వందనం కోసం రూ.9,407 కోట్లు 16-అమరావతి నిర్మాణానికి రూ.6 వేల కోట్లు 17-దీపం 2.0 పథకానికి రూ.2,601 కోట్లు 18-రోడ్ల నిర్మాణం, మరమ్మతులు రూ.4,220 కోట్లు 19-బాల సంజీవని పథకం కోసం రూ.1,163 కోట్లు 20-పోర్టులు, ఎయిర్‌పోర్టుల కోసం రూ.605 కోట్లు 21-చేనేత, నాయీ బ్రాహ్మణుల ఉచిత విద్యుత్‌కు రూ.450 కోట్లు 22-RTGSకు రూ.101 కోట్లు 23-ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్లు రూ.27,518 కోట్లు 24-అన్నదాత సుఖీభవకు రూ.6,300 కోట్లు 25-పోలవరం కోసం రూ.6,705 కోట్లు 26-జల్‌జీవన్‌ విషన్‌కు రూ.2,800 కోట్లు 27-వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.13,487 కోట్లు 28-పౌరసరఫరాల శాఖకు రూ.3,806 కోట్లు 29-బీసీల సంక్షేమానికి రూ.47,456 కోట్లు 30-ఎస్సీల సంక్షేమానికి రూ.20,281 కోట్లు 31-ఎస్టీల సంక్షేమానికి రూ.8,159 కోట్లు 32-అల్పసంఖ్యాక వర్గాలకు రూ.5,434 కోట్లు 33-మహిళా శిశు సంక్షేమం, వృద్ధులు, దివ్యాంగుల కోసం రూ.4,332 కోట్లు 34-వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమానికి రూ.19,264 కోట్లు 35-పరిశ్రమలు, వాణిజ్య శాఖకు రూ.3,156 కోట్లు 36-ఆర్‌ అండ్‌ బీకి రూ.8,785 కోట్లు 37-యువజన, సాంస్కృతిక శాఖకు రూ.469 కోట్లు 38- *తెలుగు భాష అభివృద్ధి, ప్రచారం* *కోసం రూ.10* *కోట్లు* 39-నవోదయ 2.0 కార్యక్రమానికి రూ.10 కోట్లు 40-డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి రూ.3,486 కోట్లు 41-రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజనకు రూ.500 కోట్లు 42-ధరల స్థిరీకరణ నిధికి రూ.300 కోట్లు 43-ITI, IITల కోసం రూ.210 కోట్లు 44-దీన్‌దయాళ్‌ అంత్యోదయ యోజనకు రూ.745 కోట్లు 45-రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌కు రూ.10కోట్లు 46-ప్రకృతి సేద్యం ప్రోత్సాహానికి రూ.62 కోట్లు 47-ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు రూ. 11,314 కోట్లు 48-మత్స్యకార భరోసాకు రూ.450 కోట్లు 49-ఎస్సీ, ఎస్టీల ఉచిత విద్యుత్‌కు రూ.400 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు 👉సేవల రంగంలో 11.7 శాతం వృద్ధి సాధించినట్లు ఆర్థిక మంత్రి గారు తెలిపారు, 👉పెన్షన్లను రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు, దీపం పథకం ద్వారా అర్హులకు 3 ఉచిత సిలిండర్లు, 204 అన్న క్యాంటీన్లను ప్రారంభించినట్లు తెలిపారు. అదేవిధంగా అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు రూ.20 వేలు, తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి రూ.15 వేలు, రూ.25 లక్షలతో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా కల్పించినట్లు మంత్రి పయ్యావుల కేశవ్ గారు తెలిపారు ఇట్లు మురళి నారాయణ్
👍 😂 ❤️ 🙏 16

Comments