BSP Andhra Pradesh
BSP Andhra Pradesh
February 25, 2025 at 03:50 PM
బహుజన్ సమాజ్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ -సర్క్యులర్- బహుజన్ సమాజ్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో బిఎస్పీ కార్యకర్తల మహాసదస్సు 10-3-2025, సోమవారం, ఉదయం 10 గంటలకు విజయవాడలో జరుగును. ఈ మహా సదస్సుకు ముఖ్య అతిథులుగా బిఎస్పీ రాజ్యసభ సభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ గౌరవ రాంజీ గౌతమ్ గారు, అతిథులుగా సెంట్రల్ కోఆర్డినేటర్ బాలయ్య గారు, మరియు రాష్ట్ర కోఆర్డినేటర్లు పూర్ణ చంద్ర రావు గారు Retd DGP, పరంజ్యోతి గారు విచ్చేయుచున్నారు. కావున, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, 26 జిల్లాల అధ్యక్షులు, ఇంచార్జులు, జిల్లా కమిటీ సభ్యులు, అన్ని అసెంబ్లీ ఇంచార్జులు మరియు అసెంబ్లీ అధ్యక్షులు వారి వారి అసెంబ్లీల నుండి పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి మహా సదస్సు ను విజయవంతం చెయ్యాల్సిందిగా తెలియజేయడమైనది. గమనిక: బిఎస్పీ కార్యకర్తల మహా సదస్సు కార్యక్రమానికి సంబంధించిన వేదిక త్వరలో తెలియజేయడం జరుగుతుంది. బందెల గౌతమ్ కుమార్ రాష్ట్ర అధ్యక్షులు బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ 🐘🐘🐘
❤️ 👍 👏 4

Comments