
HINDU MAHASABHA TELANGANA STATE
February 18, 2025 at 04:30 PM
"సరస్వతీ" నది అంతర్వాహిణియై ప్రవహిస్తోంది అని మన పురాణాలు, పూర్వీకులు చెప్పే సత్యాలను నమ్మనివారు, నమ్మేవారు అందరూ ఈ అద్భుతాన్ని ప్రత్యక్షంగా వీక్షించండి. సరస్వతీనది ఎలా భూమిలోకి వెళుతోందో! వ్యాస భగవానుడి ఆజ్ఞ మేరకు అంతర్వాహినిగా సరస్వతీదేవి "మహా భారత" రచన చేయ సంకల్పించిన వ్యాస భగవానుడికి "బధ్రీనాధ్" పరిసర ప్రాంతాలు చాలా బాగా నచ్చాయట. "గణపతి" స్వామితో కలిసి వ్యాస భగవానుడు "మహాభారత" రచన చేస్తుంటే, పక్కన ప్రవహించే "సరస్వతి" నది హోరు వారిని ఇబ్బంది పెట్టేదట. దాంతో వ్యాస భగవానుడు సరస్వతీ నదిని ఆజ్ఞాపించారట ఈరోజు నుండి నువ్వు అంతర్వాహిణియై ప్రవహించు. గంగ, యమున నదులు కలిసే సంగమ స్థలంలో నీవు వెళ్లి కలువు అంతర్వాహిణియై అని! అదియే "త్రివేణి సంగమం" గా అత్యంత పవిత్ర పుణ్యతీర్ధమై ఎల్లకాలం ఇలానే విరాజిల్లుతుంది. మీ ముగ్గురి కలయుకతో ఆ ప్రదేశం "త్రివేణీ సంగమం" అన్న పేరున ప్రసిద్ధి చెందుతుంది అని దీవించారు. ఆనాటి నుండి సరస్వతీ నది ఇక్కడ వీడియోలో చూస్తున్న ప్రదేశం నుంచి అంతర్వాహిణియై ప్రవహించటం మొదలు పెట్టింది. ఇది సనాతన హైందవ ధర్మానికి, మహోన్నత మహర్షుల గొప్పతనానికి ప్రత్యక్ష నిదర్శనం.🙏🏻