
Guruvu.In (TS) 👉 Join Now
February 24, 2025 at 02:46 AM
🙏 *శుభోదయం*🙏
*నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు*
*24/02/2025*
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
🌀 యాదగిరిగుట్ట లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వర్ణ విమాన గోపురాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించి స్వామివారికి అంకితం చేశారు.
🌀 భారంగా ఆరోగ్య భరోసా ,ఏటా పెరుగుతున్న బీమా పాలసీల ప్రీమియం, ఐదేళ్లలో దాదాపు 30% ఎక్కువ పెరిగింది.
🌀 నవ కల్పనకు... అంతర్జాతీయ వేదిక, హైదరాబాదులో రేపు ప్రారంభం కానున్న బయో ఆసియా- 2025 సదస్సు
🌀 మురుగునీటిలో హానికర వాయువులు ఉన్నా... గుర్తించి సమాచారాన్ని అందించే పరికరాన్ని ఓయూ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల బృందం రూపొందించింది.
🌀 రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థను పటిష్టం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది, ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో భాగంగా ఈ సంస్థలో నియామకాలను చేపట్టడానికి సిద్ధమవుతోంది .
🌀 యూరియాకు కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు .
🏆 *క్రీడా వార్తలు* 🏆
ఛాంపియన్స్ ట్రోఫీలో చిరకాల ప్రత్యర్థిని పాకిస్థాన్ను 6 వికెట్ల తేడాతో అలవోకగా ఓడించి భారత్ ఘన విజయం సాధించింది.
📖 *నేటి సూక్తి*.📖
20 సంవత్సరాలు ఇష్టంగా చదివితే ....80 సంవత్సరాలు హీరోగా బతుకుతాం.
🩺 *ఆరోగ్య చిట్కా*🩺
ధూమపానం ఊపిరితిత్తుల క్యాన్సర్ కు కారణం అవుతుంది.
📖 *నిన్నటి జీకే*📖
చంద్రయాన్ 4 ఏ సంవత్సరంలో లాంచ్ కానుంది?
*జవాబు* : 2027వ సంవత్సరం.
🌎 *నేటి జీకే* 🌍
ఫిబ్రవరి 4న వాటర్ షెడ్ యాత్రా అనే జాతీయ స్థాయి కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు?
*సేకరణ: మధూకర్ బొమ్మెర*