Ramszoomin
                                
                            
                            
                    
                                
                                
                                February 24, 2025 at 06:00 AM
                               
                            
                        
                            సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి వెళ్తున్నారా.. కొత్త మార్పులు, దారులు 💥📢📢
( share it... Very imp )
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అభివృద్ధి  పనులతో  ప్రయాణీకులకు సూచనలు 
దక్షిణ మధ్య రైల్వే   రూ. 720 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిష్టాత్మకమైన 
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను
 అప్‌గ్రేడేషన్ ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో భాగంగా, స్టేషన్‌లో సివిల్ పనులు జరుగుతున్నాయి,  ఉత్తరం వైపున ఉన్న స్టేషన్ భవనాన్ని కూల్చివేసి కొత్త భవనం నిర్మించబడుతుంది. రైలు ప్రయాణీకులకు  భద్రతను కల్పిస్తూ ఎలాంటి  అసౌకర్యం లేకుండా ఉండేందుకు పలు కీలకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఈ విషయంలో, రైలు ప్రయాణీకులు స్టేషన్ లోకి ప్రవేశించే అలాగే  మరియు నిష్క్రమించే ద్వారలలో రాకపోకలను  సమర్థవంతంగా నిర్వహించడానికి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రద్దీని క్రమబద్ధీకరించడానికి కొన్ని చర్యలు చేపట్టారు.
అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి:-
ప్లాట్‌ఫామ్ నెం.1కి ..గేట్ నెం.2 (గణేష్ ఆలయం పక్కన) వద్ద కొత్త ప్రవేశ ద్వారం తెరవబడింది, దానితో పాటు జనరల్ బుకింగ్ కౌంటర్ సౌకర్యం, విచారణ మరియు 750 మంది ప్రయాణీకులు నిలిచి వుండే సామర్థ్యంతో కల్గిన 500 అదనపు సీటింగ్ సామర్థ్యంతో నూతన వెయిటింగ్ హాల్‌ను ఏర్పాటు చేశారు.
గేట్ నంబర్ 4 మూసివేయబడినందున, గేట్ నంబర్ 3 మరియు 3బీ (స్వాతి హోటల్ ఎదురుగా) వద్ద అదనపు ప్రవేశం కల్పించబడింది.
ప్లాట్‌ఫామ్ నంబర్ 10 లోని గేట్ నంబర్ 8 (భోయిగూడ వైపు ప్రవేశ ద్వారం) వద్ద జనరల్ బుకింగ్ సౌకర్యంతో పాటు కొత్త ప్రవేశం ద్వారం తెరవబడింది.
స్టేషన్ లోకి ప్రవేశించే ఎంట్రీ/ఎగ్జిట్‌ల (బయటకు వెళ్ళే) మార్గం వద్ద ప్రయాణికులు తరచు తిరిగే  ప్రాంతాలలో ప్లాట్‌ఫారమ్‌లలో మరియు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలపై సులభంగా గుర్తించడానికి మరియు ప్రయాణీకుల కదలిక సజావుగా సాగడానికి తగిన సైన్ బోర్డులు మరియు దిశానిర్దేశ బోర్డులను ఏర్పాటు చేశారు.
స్టేషన్‌లో
కమర్షియల్ ఇన్‌స్పెక్టర్లను  నియమించారు మరియు ఏదేని  పరికరాల  మరమ్మత్తు ఏర్పడితే వాటిని గుర్తించి సత్వరమే సరిచేయడానికి మరియు ఏదైనా అవాంఛనీయ సంఘటనలు తలెత్తితే సత్వర చర్యలు తీసుకోవడానికి 24x7 పర్యవేక్షణ జరుగుతోంది.
కుంభమేళా  సందర్భంగా ప్రత్యేక రైళ్ల పర్యవేక్షణతో పాటు, రద్దీ సమయాల్లో రద్దీని పర్యవేక్షించడానికి కమర్షియల్ అధికారులను నియమించారు.
ఏ సమయంలోనైనా, రద్దీనీ నియత్రించడం కోసం స్టేషన్‌లో తగినంత టికెట్ తనిఖీ సిబ్బంది అందుబాటులో ఉంటారు. మరియు ప్రయాణీకుల సురక్షితమైన మరియు సజావుగా రైలు ఎక్కేందు కోసం తగిన జాగ్రతలు తీసుకోవడం జరిగింది.
24 గంటలూ పరిమిత సంఖ్యలో స్టాళ్లు పనిచేస్తూనే ఉంటాయి.
ప్లాట్‌ఫారమ్ 01 & 10 వద్ద వుండే అందుబాటులో వున్న  ట్రైన్ లో ప్రయాణించే ప్రయాణికుల కోసం  చివరి నిమిషంలో  పరుగెత్తకుండా, ఆయా ప్లాట్‌ఫారమ్‌లకు సులువుగా   వెళ్లిపోవడానికి వీలుగా ప్లాట్‌ఫారమ్‌లను ముందుగానే ఎంపిక చేస్తున్నారు.
ప్లాట్‌ఫారమ్‌లకు ,ఆలస్యంగా వచ్చిన వారు, దివ్యాంగజన్ కోచ్ స్థానం లాంటి  మొదలైన వాటి గురించి తరచుగా ప్రకటనలు చేస్తున్నారు.
ప్రయాణికుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించడానికి ఎంట్రీ/ఎగ్జిట్ గేట్లు, ప్లాట్‌ఫారమ్‌లు, కాన్‌కోర్స్‌లు మరియు ఫుట్ ఓవర్ బ్రిడ్జిల వద్ద అదనపు ఆర్ పి ఎఫ్  (రైల్వే భద్రత దళ సిబ్బందిని) మోహరించారు.
భద్రతా సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించడానికి ఆర్ పి  ఎఫ్ సిబ్బంది మెరుగైన సి సి టీ వి నిఘా నెట్‌వర్క్ ద్వారా రియల్-టైమ్ పర్యవేక్షణ చేస్తారు.
మహిళా ప్రయాణీకులకు సురక్షితమైన పరిస్థితినీ  కల్పించడం  కోసం మహిళల భద్రత కోసం ఆర్ పి ఎఫ్ శక్తి బృందాల మోహరింపు చేయడం జరిగింది.
అలాగే  స్టేషన్ లో  అగ్నిమాపక భద్రతా తనిఖీలు చేపట్టడంతో పాటు  భద్రతా ప్రోటోకాల్‌లను అనుసరిస్తున్నారు.
స్టేషన్ పునరాభివృద్ధి పనులలో భాగంగా పెద్ద ఎత్తున నిర్మాణ పనులు జరుగుతున్నందున రైలు వినియోగదారులు సహకారాన్ని అందించాలని  రైల్వే శాఖ  విజ్ఞప్తి చేస్తోంది . సికింద్రాబాద్ స్టేషన్ నుండి ప్రయాణించే  ప్రయాణీకుల భద్రత, రక్షణ మరియు పూర్తి స్థాయిలో  సౌకర్యాలను కల్పించేందుకు గాను  దక్షిణ మధ్య రైల్వే జోన్ కట్టుబడి ఉంది. ప్రయాణీకులు.. సైన్ బోర్డులను అనుసరించాలని, అధికారులతో సహకరించాలని మరియు ఏదైనా సహాయం కోసం తక్షణ సహాయం కోసం ఆర్ పి ఎఫ్ హెల్ప్‌లైన్ - 139ని సంప్రదించవచ్చని అభ్యర్థించారు.
(ఎ.శ్రీధర్)
ముఖ్య ప్రజా సంబంధాల అధికారి.
దక్షిణ మధ్య రైల్వే
#secundrabadrailwaystation #newchanges #journalistsatishkumar