
SubhaVaastu.com - Vastu Consultancy Services
February 22, 2025 at 09:45 AM
ప్రయాగ్‌రాజ్‌కి ప్రయాణించే వారికి ముఖ్యమైన సమాచారం
1. ప్రయాగ్‌రాజ్‌లో ఆన్‌లైన్ ద్వారా హోటల్ బుక్ చేసుకోవడం వల్ల అతి పెద్ద ట్రాఫిక్ కారణంగా మీరు అనుకున్న సమయానికి హోటల్ చేరుకోలేకపోవచ్చు. సమయానికి హోటల్ చెక్-ఇన్ చేయలేకపోతే, ఆన్లైన్లో మీరు కట్టిన డబ్బులు తిరిగి రావు.
2. మేము వ్యక్తిగతంగా మేక్‌మైట్రిప్ పోర్టల్ ద్వారా హోటల్ బుక్ చేసుకుని, ముందుగానే చెల్లింపులు చేసి, గత ఆదివారం రాత్రి 8 గంటలకు ప్రయాగ్‌రాజ్ చేరుకున్నాం. హోటల్ కేవలం 9 కిలోమీటర్ల దూరంలోనే ఉంది, కానీ 5 గంటల తర్వాత కేవలం 2 కిలోమీటర్లదాకా మాత్రమే వెళ్లగలిగాం. ఇంకా 7 కిలోమీటర్ల దూరం ఉండటంతో, హోటల్ చేరుకోవడానికి మరో 14 నుంచి 15 గంటలు పట్టొచ్చని అర్థమైంది. వెంటనే మేక్‌మైట్రిప్ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేశాం. అదృష్టవశాత్తూ, మేము చెల్లించిన డబ్బులు తిరిగి వచ్చాయి. అయితే, అన్ని బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లు ఇలా రిఫండ్ ఇవ్వవు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి.
3. ప్రత్యక్షంగా హోటల్‌కు వెళ్లి బుక్ చేసుకోవడం ఉత్తమమైన మార్గం. ఆన్‌లైన్ హోటల్ బుకింగ్ చేసుకోవద్దు.
4. ప్రయాగ్‌రాజ్‌లో మా అనుభవం నిజంగా అద్భుతంగా ఉంది. ప్రతి చిన్న విషయం చాలా చక్కగా ప్లాన్ చేసి, అమలు చేసింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ఇంత బాగా ఏర్పాట్లు చేసినందుకు UP ప్రభుత్వానికి మనసారా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాము.
🙏
👍
3