
YVU NEWS
February 6, 2025 at 08:40 AM
వైవి యూనివర్సిటీ అకడమిక్ అఫైర్స్ డీన్ గా
ప్రొఫెసర్ చంద్ర ఓబుల్‌రెడ్డి
వైవీ యూనివర్సిటీ డీన్ గా విశ్వవిద్యాలయ వృక్షశాస్త్ర ఆచార్యులు పి.చంద్ర ఓబుల్‌రెడ్డి ని నియమించారు. గురువారం విశ్వవిద్యాలయంలోని వీసీ చాంబర్లో ఆచార్య చంద్ర ఓబుల్‌రెడ్డి
కి ఉపకులపతి ఆచార్య
కె. కృష్ణారెడ్డి, ఇన్-చార్జ్ కులసచివులు మరియు ప్రధానాచార్యులు ఎస్. రఘునాథరెడ్డితో కలసి నియామకపు పత్రాన్ని అందజేశారు. ఇదివరకు ఈ స్థానంలో పనిచేసిన
కెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్ ఏజీ దాము పదవీకాలం పూర్తికావడంతో ఈ నూతన నియామకం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆచార్య టి.చంద్ర శేఖర్ పాల్గొన్నారని ప్రజాసంబంధాల విభాగ సంచాలకులు డా.పి. సరిత పేర్కొన్నారు