YVU NEWS
YVU NEWS
February 18, 2025 at 02:30 PM
యోగి వేమన విశ్వవిద్యాలయం, ( NAAC 'A' Grade) ప్రజా సంబంధాల విభాగం, కడప. ***************** పత్రికా ప్రకటన **************** తేదీ: 18- 02- 2025. ***************** యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఆచార్య ఫణితి ప్రకాష్ బాబు యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఆచార్య ఫణితి ప్రకాష్ బాబు నియమితులయ్యారు.యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లోని స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ బయోటెక్నాలజీ అండ్ బయోఇన్ఫర్మేటిక్స్ విభాగం సీనియర్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ ఫణితి ప్రకాష్ బాబు ను వైవీయూ వీసీగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి జి ఓ ఎం ఎస్ నెంబర్ 6 ను మంగళవారం విడుదల చేసింది. 1987-1992 వరకు హైదరాబాద్ లోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, రీసెర్చ్ ఫెలో గా పరిశోధన పూర్తిచేశారు. 1992-1996 వరకు తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ జువాలజీ లెక్చరర్ గా పనిచేశారు.1996-2000 సంవత్సరం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ యానిమల్ సైన్సెస్ లెక్చరర్ గా, , డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (2006 వరకు), ఏపీ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (2010), ఇండియన్ అకాడమీ ఆఫ్ న్యూరోసైన్సెస్, లక్నో (2008) ఫెలో గా పనిచేశారు. 2001-2006 వరకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ యానిమల్ సైన్సెస్, రీడర్ బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత ఇదే శాఖలో ప్రొఫెసర్ గాఉన్నారు. పలు ప్రతిష్టాత్మకమైన సంస్థలకు నేతృత్వం వహించారు. అందులో వైస్ ప్రెసిడెంట్ సొసైటీ ఫర్ న్యూరోకెమిస్ట్రీ, ఇండియా (ఎస్.ఎన్.సి.ఐ) (2012-2013). సెక్రటరీ, ఆసియా పసిఫిక్ సొసైటీ ఫర్ న్యూరోకెమిస్ట్రీ (ఎపీఎస్ఎన్), సింగపూర్, (2006-2010). కౌన్సిల్ సభ్యుడు 2010-2014. జనరల్ సెక్రటరీ: సొసైటీ ఫర్ న్యూరోకెమిస్ట్రీ, ఇండియా (ఎస్ఎన్సీఐ) (2006-2011). న్యూరోసైన్సెస్, న్యూరోడెజెనరేటివ్ వ్యాధులపై ఈయన పరిశోధనలు చేశారు. పలు ప్రతిష్టాత్మకమైన అవార్డులు ఫెలోషిప్‌లు అందుకున్నారు. అందులో బి.పి.పాండే స్మారక ప్రసంగ పురస్కారం, ఇండియన్ సొసైటీ ఫర్ పారాసిటాలజీ, (2009), తులసాబాయి సోమాని ఎడ్యుకేషనల్. ట్రస్ట్ అవార్డు, ఇండియన్ అకాడమీ ఆఫ్ న్యూరోసైన్స్ (2002); యంగ్ సైంటిస్ట్ ప్రాజెక్ట్ అవార్డీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (1996), బయోటెక్నాలజీ ఓవర్సీస్ ఫెలో, యు.కె (2007); డీఎస్టీ -డి.ఎ.ఎ.డి ఫెలో, యూనివర్శిటీ ఆఫ్ హైడెల్‌బర్గ్, జర్మనీ (2006-08); ఎస్టిఏ-ఫెలో, జపాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్పొరేషన్ (1999-01), బాయ్‌స్కాస్ట్-ఫెలో, డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (1998) ఉన్నాయి. వర్క్‌షాప్‌లు నిర్వహిస్తూ వివిధ విశ్వవిద్యాలయాలు , కళాశాలల విద్యార్థులకు, ముఖ్యంగా వెనుకబడిన వారికి శిక్షణలు ఇవ్వడం , సమాజంలోని అట్టడుగు స్థాయిలో, ముఖ్యంగా గ్రామీణ విద్యార్థుల లో శాస్త్రీయ జ్ఞానాన్ని పెంపొందించడంలో కృషిసల్పారు. మంది డాక్టరల్ విద్యార్థులకు మరియు 4 పోస్ట్-డాక్టోరల్ విద్యార్థులకు మార్గనిర్దేశం చేశాడు మరియు ప్రస్తుతం 8 పీహెచ్డీ పరిశోధకులకు మార్గనిర్దేశం చేశారు. నఇద్దరు పోస్ట్-డాక్టోరల్ విద్యార్థులు. అతను పీర్-రివ్యూడ్ జర్నల్స్‌లో 110 కంటే ఎక్కువ పరిశోధనా కథనాలను ప్రచురించాడు, 150 కంటే ఎక్కువ జాతీయ, అంతర్జాతీయ సమావేశాలలో తన పరిశోధనను సమర్పించారు. జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన అనేక సమావేశాలను నిర్వహించారు. వైవియు కు నూతన ఉపకులపతి నియామకమైనట్లు సమాచారం అందగానే అధ్యాపకులు, స్కాలర్లు విద్యార్థులు, బోధనేతర సిబ్బంది స్వాగతం పలకనున్నారు. 2024 వ సంవత్సరం జులై 19వ తేదీన ఇన్చార్జి వైస్ ఛాన్సలర్ గా విధుల్లో చేరిన ఆచార్య కె.కృష్ణారెడ్డి నూతన ఉపకుల పతి ఆచార్య ఫణితి ప్రకాష్ బాబు బాధ్యతలు అప్పగించనున్నారు. - డా.పి. సరిత సంచాలకులు, ప్రజా సంబంధాల విభాగం యోగి వేమన విశ్వవిద్యాలయం, కడప

Comments