
JAGTIAL CYBER WARRIORS
February 28, 2025 at 06:31 AM
స్వామి కార్యము - స్వకార్యం..!!
నిన్న మహా రాత్రి పర్వదినాన అనంతపురం పిరమిడ్ ధ్యాన కేంద్రంలో హాజరైన మన అనంతపురం ప్రజలకు సైబర్ నేరాల నివారణ మీద అవగాహన కల్పించడం జరిగింది..,
నేను మాట్లాడిన తర్వాత కొంతమంది నా దగ్గరకు వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎలా మోసపోయింది అని తెలిపారు..!!
పుట్టినరోజుతో మొదలెట్టి వివాహ వార్షికోత్సవము, రిటైర్మెంట్ , స్నేహితులు కలిసినప్పుడు పండుగ పర్వదినాలలో సైబర్ నేరాల మీద కనీసం ఐదు నుండి 10 నిమిషాలు చర్చించినప్పుడే సైబర్ నేరాలను నివారించవచ్చు..,
ఇంకా ఒక అడుగు ముందుకేసి వచ్చిన వాళ్లకి రిటర్న్ గిఫ్ట్ కింద సైబర్ నేరాలు మీద అవగాహన పోస్టర్ కూడా వచ్చిన వారికి ఇవ్వచ్చు..,
నిజం చెప్పాలంటే జనాలకి ఇంకా ఈ సమస్య తీవ్రతను గుర్తించట్లేదు, నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు, తనకు జరిగినప్పుడే అది సమస్య మాదిరి అనుకుంటున్నారు, కాకపోతే అప్పటికే పుణ్యకాలం అంత గడిచిపోతుంది
పోతిరెడ్డి మాధవరెడ్డి
9966272121
సైబర్ యోధులు