ఆయురారోగ్యాలు  💪 AYURAROGYALU 🩺
ఆయురారోగ్యాలు 💪 AYURAROGYALU 🩺
February 11, 2025 at 10:53 AM
Healthy Diet: వృద్ధులకు నట్స్‌ బలం! వృద్దులు ఆరోగ్యంగా ఉండటానికి.. ముఖ్యంగా తగినంత ఆహారం తీసుకోలేనివారికి బాదం, పిస్తా వంటి గింజ పప్పులు (నట్స్‌) బాగా తోడ్పడుతున్నట్టు మోనాష్‌ యూనివర్సిటీ నేతృత్వంలోని అధ్యయన బృందం గుర్తించింది. డెబ్భై ఏళ్లు పైబడిన 9,916 మందిని పరిశీలించి ఈ విషయాన్ని గుర్తించారు. ఎలాంటి పప్పులైనా సరే. వీటిని తరచూ తినేవారు ఎక్కువ కాలం జీవి స్తున్నట్టు తేలింది. అదీ మతిమరుపు, వైకల్యం వంటి ఇబ్బందులేవీ లేకుండా. గింజ పప్పుల్లో ప్రొటీన్, సూక్ష్మ పోషకాలు, అసంతృప్త కొవ్వులు, పీచు, దండిగా ఉంటాయి. కాబట్టి వీటిని చిరుతిండిగా గానీ భోజనంలో భాగంగా గానీ తీసుకోవటం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. పళ్లు బలంగా లేనివారు, నమిలే సమస్యల వంటివి గలవారు పూర్తి పప్పులను నమల్లేరు. ఇలాంటివారు పగలగొట్టి, ముక్కలు చేసుకొని సలాడ్లలో కలిపి తినొచ్చు. ఇప్పుడు నట్‌ మీల్స్, నట్‌ బటర్‌ లేదా పేస్టుల వంటివీ మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. పళ్లు బలంగా లేనివారికివి అనువుగా ఉంటాయి. అయితే ఉప్పు, చక్కెర, చాక్లెట్‌తో కలిసిన పప్పులకు దూరంగా ఉండటం మంచిది. పెద్దవారు రోజుకు 30 గ్రాములు.. అంటే చిన్న పిడికెడు గింజ పప్పులు తినొచ్చనేది సిఫారసు. ఉజ్జాయింపుగా 25 బాదం, 10 అక్రోట్లు, 40 వేరుసెనగలు తినొచ్చు. వేర్వేరు రకాలను కలిపి తింటే వివిధ రకాల పోషకాలు లభిస్తాయి. తాజా గింజ పప్పులు రుచిగా ఉండటమే కాకుండా వీటిల్లో పోషకాలూ ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి గాలి చొరని సీసాల్లో వేసి, చల్లటి ప్రదేశంలో భద్రపరచుకోవాలి.

Comments