
ఆయురారోగ్యాలు 💪 AYURAROGYALU 🩺
February 16, 2025 at 03:21 AM
• పుట్టగొడుగులతో చిరంజీవిగా!
ఎక్కువకాలం జీవించడం ఒకెత్తయితే, బతికినంత కాలం ఆరోగ్యంగా జీవించడం మరొకెత్తు. ఇలాంటి నాణ్యమైన జీవితాన్నే అందిస్తాయట పుట్టగొడుగులు. వీటిని తరచూ ఆహారంలో చేర్చుకుంటే డెమెన్షియా, సార్కోపెనియా(కండర క్షీణత)వంటి సమస్యలు రాకుండా ఉంటాయట. జర్మనీకి చెందిన లెబనీజ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎనలిటికల్ సైన్సెస్ ప్రకారం... వయసుపెరిగేకొద్దీ మనలో కొన్ని కీలకమైన ఎంజైములు తగ్గిపోతూ ఉంటాయి. ఫలితంగా శరీరంలో కండరాల క్షీణత మొదలవుతుంది. అలాగే ఒత్తిడి తట్టుకునే శక్తి కూడా తగ్గుతుంది. వీటికి ఎర్గోథయెనైన్ అనే మూలకం పరిష్కారం సూచిస్తుందట. ఇది మనకి ఒత్తిడిని జయించే శక్తిని ఇవ్వడంతోపాటూ, కండరాలు క్షీణించకుండా చూస్తుంది. వయసుతో సంబంధం లేకుండా చురుగ్గా ఉండేట్టు చేస్తుంది. అయితే ఈ మూలకాన్ని మన శరీరం సహజంగా ఉత్పత్తి చేసుకోలేదు. కానీ పుట్టగొడుగుల నుంచీ పులియబెట్టిన ఆహారం నుంచీ ఈ మూలకాన్ని అందుకోవచ్చట. అందుకే వయసు పెరుగుతున్నా చురుగ్గా, చలాకీగా ఉండేందుకు పుట్టగొడుగులని ఆహారంలో చేర్చుకొమ్మంటున్నారు శాస్త్రవేత్తలు.
#mashrooms