
ఆయురారోగ్యాలు 💪 AYURAROGYALU 🩺
February 16, 2025 at 12:18 PM
• మిర్చి కూడా మంచే చేస్తుంది!
కూర, చారుల్లో ఒకటి రెండు మిర్చి వేస్తే చక్కటి రుచీ, పరిమళం. వీటితో రోటి పచ్చడి చేస్తే అదిరిపోతుంది.
ఇక మిర్చిబజ్జీ గురించి చెప్పాల్సిందే లేదు. రుచి సంగతి అలా ఉంచితే మిర్చి ఎలా మేలు చేస్తుందో చూద్దాం..
పచ్చిమిర్చిలో సి-విటమిన్ విస్తారంగా ఉంటుంది.
అది రోగనిరోధక శక్తిని పెôచి, అనారోగ్యాన్ని తరిమేస్తుంది.
మనసును హాయిగా ఉంచుతాయి.
ఆ రుచి, పరిమళం నోటికి హితవుగా ఉంటాయి.
జీర్ణప్రక్రియ బాగుంటుంది.
చర్మానికి కాంతినిస్తాయి.
ఇందులో ఉండే ఎ-విటమిన్ కంటిచూపును మెరుగుపరుస్తుంది.
ఇవి రక్తపోటును, కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుతాయి. రక్తం గడ్డ కట్టకుండా అరికడతాయి.
ఒక్క మాటలో చెప్పాలంటే గుండెజబ్బులకు చెక్‌పెట్టినట్టవుతుంది.
వీటిలో ఉండే క్యాప్సాయిసిన్ నొప్పుల నుంచి
ఉపశమనం కలిగిస్తుంది.
బరువు తగ్గేలా తోడ్పడతాయి.
ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఇవి మేలు చేసే మాట ఎంత నిజమో కీడు కలిగించే మాటా అంతే నిజం. మితిమీరి తింటే.. అల్సర్, కడుపుబ్బరం లాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది కనుక తగినంతే తింటూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉందాం..!
#ఆయురారోగ్యాలు #ayurarogyalu #health #mirchi
#chilli #greenchilli #greenchillies #food
#gouthamavenkataramanaraju