
ఆయురారోగ్యాలు 💪 AYURAROGYALU 🩺
February 18, 2025 at 08:23 AM
• ఊబకాయాన్ని నివారించే మెంతికూర
తోటకూర, పాలకూరలంత తరచుగా కాకున్నా మెంతికూర కూడా మన మెనూలో ఉంటూనే ఉంటుంది. బంగాళదుంపలు, బఠాణీలతో చేర్చి వండితే బలే కమ్మగా ఉంటుంది కదూ!
ఇంతకీ ఇందులో ఎన్ని సుగుణాలున్నాయో …!
మెంతికూర తినడం వల్ల శరీరానికి పీచు, ఐరన్, జింక్, క్యాల్షియం, సోడియం, పొటాషియం, కాపర్, మెగ్నీషియం, భాస్వరం, ఎ, సి విటమిన్లు అందుతాయి.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
జీర్ణప్రక్రియ సాఫీగా ఉంటుంది, ఆకలి పెరుగుతుంది.
ఇది కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది. రక్తం గడ్డకట్టదు.
గాయాలు త్వరగా మానతాయి.
ఊబకాయం రాదు.
గ్యాస్ట్రిక్ సమస్య రాకుండా కాపాడుతుంది.
చర్మానికి నునుపు, మెరుపు వస్తాయి.
శ్వాస సమస్యలు తగ్గుతాయి.
జుట్టు రాలదు, కుదుళ్లు దృఢంగా ఉంటాయి.
మూత్రపిండాల పనితీరు మెరుగవుతుంది.
నెలసరిలో వచ్చే ఇబ్బందుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
కాలేయాన్ని రక్షిస్తుంది.
ఎముకలకు పటుత్వం వస్తుంది.
బాలింతలు మెంతికూర తినడం వల్ల పాలు బాగా పడతాయి.
దీంతో కూర, పచ్చడి, సూప్, సలాడ్ చేయొచ్చు. పరోటా, శాండ్‌విచ్ మొదలైనవాటిల్లో వేయొచ్చు.
#మెంతికూర #methi #ఆయురారోగ్యాలు #ayurarogyalu #health #foodforhealth
#gouthamavenkataramanaraju