ఆయురారోగ్యాలు  💪 AYURAROGYALU 🩺
ఆయురారోగ్యాలు 💪 AYURAROGYALU 🩺
February 23, 2025 at 09:05 AM
• నిస్సత్తువ పోగొట్టే కివీ నీళ్లు సపోటా, ద్రాక్ష, కమలా.. ఇలా ఆయా కాలాల్లో దొరికే పండ్లు నానబెట్టిన నీళ్ల గురించి తెలుసుకుంటున్నాం కదా! ఈసారి కివీ వాటర్‌ ఆరోగ్యపరంగా ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. కివీ ఇన్‌ఫ్యూజ్‌డ్‌ వాటర్‌ ఇలా చేయాలి… నాలుగు కివీ పండ్లను చెక్కు తీసి, స్లైసులు చేసి.. లీటరు నీళ్లలో వేయాలి. కొన్ని ముక్కలు గుజ్జు చేసి వేస్తే మరింత రుచిగా ఉంటుంది. అందులో కొన్ని పుదీనా ఆకులను నలిపి వేయాలి. ఓ గంట తర్వాత వాటిని తీసేసి నీళ్లు తాగొచ్చు. మరీ పచ్చివీ లేదా మిగలపండినవీ కాకుండా పక్వానికి వచ్చిన కివీ పండ్లను ఎంచుకోవాలి. వీటిని రాత్రి ఫ్రిజ్‌లో ఉంచి, ఉదయం ఉపయోగించాలి. ఈ నీటి వల్ల.. అరుగుదల బాగుంటుంది. అజీర్తి, ఆకలి మందగించటం లాంటి సమస్యలు రావు. బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో చేరిన విషపదార్థాలు హరిస్తాయి. శక్తి చేకూరుతుంది, నిస్సత్తువ ఉండదు. రక్తపోటు క్రమబద్ధంగా ఉంటుంది. గుండెజబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. నీ కంటిచూపు మెరుగవుతుంది. ఎముకలకు పటుత్వం చేకూరుతుంది. ఈ నీరు రుచిగా ఉంటుంది కనుక పిల్లలతో ఎక్కువ తాగించవచ్చు. #kiviinfusedwater #kivi #ayurarogyalu #ఆయురారోగ్యాలు #gouthamavenkataramanaraju

Comments