Chaayabooks.com
Chaayabooks.com
February 24, 2025 at 11:07 AM
ప్రపంచంలో అన్ని రకాల ఆత్మలూ ఉంటాయి, చిన్నవీ, పెద్దవీ అన్నీ. మహాత్మ అంటాం! అంటే గొప్ప ఆత్మ అని. మనవన్నీ అట్లా కాకుండా చిన్న-ఆత్మలు! మనం కూడా వేరే ఆత్మలన్నిట్నీ గౌరవించాల, ప్రేమించాల. మనకంటే చిన్న ఆత్మలు కూడా ఉంటాయి. ఆటినీ ఆటి బాగోగుల్నీ మనమే చూసుకోవాల, కాపాడాల! ఇప్పుడు ఈ సరుకులకి మనం లేకపోతే అయ్యన్నీ వీధుల్లో పడి ఆకలి చావులు చస్తాయి. కానీ మన చేతికిందుంటే మాత్రం అవింక దేనికీ చూసుకోనక్కర్లే! పూట పూటకీ కావాల్సినంత తిండి, నెత్తి మీద గూడు, మంచం పడితే మందులూ...” పండారం మునకేసి మళ్ళీ లేచాడు. “పశువులు, కోళ్ళు… ఈటన్నిట్నీ కాచుకోట్లే మనం! అయన్నీగూడా చిన్న చిన్న ఆత్మలే గదా!” అన్నాడు పండారం మళ్ళీ మునకేస్తూ. https://www.amazon.in/dp/8198229353
😢 1

Comments