APSSDC  - KURNOOL
APSSDC - KURNOOL
February 4, 2025 at 02:55 AM
*🧑‍💻రేపటి నుంచి పారిశ్రామికవేత్తలకు అవగాహన సదస్సు* కర్నూలు అర్బన్: ఈ నెల 5 నుంచి 7 వరకు మూడు రోజుల పాటు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు వ్యాపార నిర్వహణ శక్తి సామర్థ్యాలపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆనంద్ రాజుకుమార్ తెలిపారు. నగరంలోని బిర్లాగేట్ సమీపంలోని రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ సంకల్ప్ పథకంలో భాగంగా నిర్వహించే కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పారిశ్రామికవేత్తలు ఎదగడానికి కావాల్సిన మెలకువలు, వ్యాపారం చేసుకోవడానికి కావాల్సిన విధి విధానాలపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 96761 41731 సంప్రదించాలని తెలిపారు.

Comments