ప్రభుత్వ పథకాల వారధి (Munirathnam Updates)
ప్రభుత్వ పథకాల వారధి (Munirathnam Updates)
February 9, 2025 at 01:53 PM
LIC వద్ద క్లయిమ్ చేయని ఖాతాలు ఆన్లైన్ లో చెక్ చేసుకోవచ్చు. అనెక్లెయిమ్డ్ మెచ్యూరిటీ అమౌంట్ను చెక్ చేసుకోటానికి LIC వెబ్ సైట్ https://licindia.in/home ను సందర్శించాలి. హోమ్ పేజీలోని "కస్టమర్ సర్వీస్" ఆప్షన్పై క్లిక్ చేసిన తర్వాత "అనెక్లెయిమ్డ్ అమౌంట్స్ ఆఫ్ పాలసీహోల్డర్స్" ఎంచుకోవాలి. పాలసీ నంబర్, పేరు, పుట్టిన తేదీ, పాన్ కార్డ్ నంబర్ తదితర వివరాలను అందించి చివరగా సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి. క్లెయిమ్ పొందడానికి ఎస్ఐసీ కార్యాలయం నుంచి సంబంధిత ఫారం తీసుకోవచ్చు లేదా సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పాలసీకి సంబంధించిన ప్రీమియం రసీదులు, ఇతర ధ్రువీకరణ పత్రాలను ఆ ఫారంతో పాటు సమర్పించాలి. ఒకవేళ పాలసీదారుడు మరణించినట్లయితే, అతని డెత్ సర్టిఫికెట్ అందజేయాల్సి ఉంటుంది. LIC మీ క్లెయిమ్ను పరిశీంచిన తర్వాత సాధ్యాసాధ్యాలను బట్టి క్లెయిమ్ చేయని డబ్బు మీ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసే వీలుంది.
❤️ 1

Comments