
@VoiceOfBjpTeluguStates_Yrr.!®️
February 25, 2025 at 12:51 PM
🕉️🍀🕉️🍀🕉️🍀🕉️🍀🕉️🍀🕉️🍀
ఇదీ శివలింగ తత్త్వం
(నవంబర్ 2012, నది మాసపత్రిక నుంచి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి వ్యాసం)
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
👁️
🗣️VOB_APTS
https://whatsapp.com/channel/0029VaAjrR34NVioe5NqrV0Y
🧿
#yrr_playlist_youtube.!*
📤
https://youtube.com/playlist?list=PLDmczuKvRxqHe6SLQ9_8CPJbwITQu_ucO&si=o3s9DrCWmQ9iRpGE
♻️
సృష్టిస్థితిలయలను నిర్వహించే పరమేశ్వర చైతన్యాన్ని బహువిధాలుగా భావించి, అర్చించి అనుగ్రహబలాన్ని పొందే విధానాలను వేదాది శాస్త్రాల ద్వారా మన సనాతన ధర్మం విస్తృతంగా సాధించింది.
అందులో 'శివలింగారాధన' ఒకటి. 'లింగ' శబ్దానికి అద్భుత శాస్త్రార్థాలున్నాయి.
స్థూలంగా ఆరాధనలో 'లింగం' అనే మాటకు 'మూర్తి' అని అర్థం చెప్పవచ్చు. మనం కంటితో చూడలేని భగవంతుని ఏదో ఒక బింబం (అది కరచరణాద్యవయవాలున్న విగ్రహం కావచ్చు. ఒక ప్రతీకగా భావించే శిలయో, పసుపు ముద్దో, కలశమో కావచ్చు)గా గ్రహించి, శాస్త్ర పద్ధతుల ద్వారా ప్రతిష్ఠ ఆవాహన వంటి ప్రక్రియలతో ఆరాధించడం సంప్రదాయం, అలా ఆరాధింపబడే బింబాన్ని 'లింగం' అనడం శాస్త్రార్థం.
పాండురంగని విగ్రహాన్ని స్తుతిస్తూ "పరబ్రహ్మలింగం భజే పాండురంగం" అని కీర్తించారు ఆదిశంకరులు. విష్ణు విగ్రహాన్ని 'పరబ్రహ్మ లింగం' అనడం గమనించాల్సిన విషయం.
ఇలాగే సాలగ్రామ శిలని 'విష్ణులింగం'గా, నర్మద బాణశిల 'శివలింగం'గా, శోణశిల 'గణేశలింగం'గా, సువర్ణ ముఖరీ నదిలో లభించే ధాతువు/శ్రీచక్రం 'శక్తిలింగం'గా భావించవచ్చు.
అయితే శివునకు ప్రత్యేకించి 'శివలింగం' అని, ప్రతి ఆలయంలోనూ లింగారాధనగా విగ్రహాలు కాకుండా - పూజించడంలో ప్రత్యేకత ఏమిటి? ఇది చర్చనీయాంశం.
దీని గురించి శివ పురాణాదులలో, శైవాగమాలలో వివరణ ఉంది. వాటిని మాత్రమే గ్రహించాలి.
కొన్ని శివేతర గ్రంథాలలో కేవల 'మర్మాంగం'గా చూపించిన కల్పనలను గ్రహించి, హైందవ ద్వేషులు వాటిని ప్రచారం చేయడం శోచనీయం. అలాంటి అవాకులూ చెవాకులూ వల్ల విదేశీకుతూహలశీలురు శివలింగం గురించి నీచాభిప్రాయాలను వెలిబుచ్చారు గూడా. కానీ ఆ రోజుల్లో స్వామి వివేకానంద దానికి గట్టి సమాధానమిచ్చారు. యజ్ఞంలోని యూపస్తంభమే 'శివలింగం'గా భావించవచ్చు అని చెప్పడం వారి సమాధానాలలో ఒకటి.
అయితే అంతటితో ఆగకుండా యోగ, వేద, జ్యోతిర్విజ్ఞానాలను పరిశీలించి మన శాస్త్రాల హృదయం ప్రకారం 'శివలింగ' తత్త్వమేమిటో శోధిస్తే ఆశ్చర్యకరమైన మహద్విజ్ఞానాంశాలు గోచరిస్తున్నాయి. వాటిని పరామర్శ చేసుకుందాం (సాధ్యమైనంత).
* 'లయనాత్ లింగముచ్యతే...' లీనం చేసుకునేదే లింగం.
చరాచర జగతి ఎవరి యందు కలిగి, పెరిగి, తిరిగి లీనమవుతుందో అదే లింగం. సర్వజగతి సృష్టి స్థితి లయలనే మూడు దశలలోనూ సర్వశక్తిమంతమైన ఈశ్వర చైతన్యంలోనే లీనమై ఉంది. అందుకే ఆ ఈశ్వరుని 'లింగం' అన్నారు. ఆ లీనం వల్లనే సృష్టికి శక్తి, ఉనికి, మనుగడ లభిస్తున్నాయి.
* ఆ ఈశ్వరుని ఆకారాదిరహితునిగా భావిస్తూ, ఒక సంకేతంగా గ్రహిస్తే- ఆద్యంతరహితమైన జ్యోతి స్వరూపానికి ప్రతీకయే లింగం. అందుకే జ్యోతిర్లింగం అన్నారు.
ధ్యాన ప్రక్రియ పరంగా శరీరంలోని ఆజ్ఞాచక్ర స్థానంలో మన దేహ వ్యవస్థను నడిపే జ్ఞాన స్వరూపాన్ని దీపజ్యోతి వంటి ఆకారంగా ధ్యానించే విధానం ఉంది. ఆ జ్యోతియే మనలో జ్యోతిర్లింగం. కనుబొమల నడుమనున్న ఆ అజ్ఞాచక్ర స్థానమే మనలోని కాశీక్షేత్రం... ఈ వివరణలు కొన్ని ఉపనిషత్తులలోనూ, ధ్యాన శాస్త్రాలలోనూ, పురాణాంతర్గత కాశీ మాహాత్మ్యాలలోనూ స్పష్టంగా ఉన్నాయి.
* మనలోని ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, మనస్సు, జీవుడు... వెరసి పన్నెండు స్థానాలలో ఒకే ఈశ్వర చైతన్యం ఉన్నది. ఆ ఈశ్వర జ్యోతియే ఈ పన్నెండు చోట్ల ఉన్నదనే ఎరుకయే పన్నెండు జ్యోతిర్లింగాలను మనలో దర్శించడం. అప్పుడు మన అణువణువూ శివమయమనే భావన నిలచి 'శివోహ'మనే సత్యాన్ని స్థిరపరచుకోగలం.
యోగపరంగా - దేహంలో మూలాధారం నుండి, సహస్రారం వరకు ఉన్న సుషుమ్నా నాడిలోని (చిదేకరసరూపిణి) శక్తి ప్రవాహం ఒక కాంతిమయ స్తంభంగా దర్శిస్తే అదే అగ్నిమయమైన శివలింగంగా గ్రహించగలం.
అనేకంగా, విస్తారంగా కనిపించే ఈ విశ్వచక్రానికి (వృత్తానికి) కేంద్రంగా ఉన్న అత్యంత సూక్ష్మ స్వరూపమే ఈశ్వరతత్త్వం. ఇదే శ్రీచక్రంలోని బిందుస్థానాన్ని, ఈ బిందువునే పైకిలాగితే ఒక నిలువుగీత (స్తంభాకృతి)గా సాగుతుంది. అదే శివుడు ప్రథమంగా అగ్ని స్తంభాకృతి కలిగిన లింగంగా వ్యక్తమయ్యాడనే పురాణ కథలోని దర్శనం.
శ్రీచక్రంలోని బిందువే శివలింగం. దాని తరువాతి ఆవరణయైన 'త్రికోణం' ఇచ్ఛాజ్ఞాన క్రియలనే మూడు బిందువులను కలిపిన శివశక్తి అభివ్యక్తి. ఈ రెండే పానవట్టం (త్రికోణం)గా, లింగం (బిందువు)గా సంకేతించబడ్డాయి.
* ఒక దీపజ్యోతిని వెలిగించే అన్ని దిక్కుల కాంతిని ప్రసరిస్తున్న లింగాకృతిగానే దర్శనమిస్తుంది. అదే ఆకారాతీతమైన చైతన్య జ్యోతిర్లింగం.
* ఇక వేదవిజ్ఞానం శివస్వరూపాన్ని, విశ్వసత్య సాక్షాత్కారంగా సంభావించింది.
ఈ సమస్త విశ్వమూ విడివిడిగా కనబడుతున్నా, అన్నీ ఒకే మహాచైతన్యంలోని భాగాలే. ఆ చైతన్యంలో ఈ అనేకములున్నాయి. వీటన్నింటిలో ఆ చైతన్యముంది. ఆ 'ఉండడమే' (ఉనికియే) 'లీనం', అదే లింగం. కెరటాలు ఎన్నో ఉన్నా, కడలి ఒక్కటే. కానీ అన్ని కెరటాలకీ అసలు ఉనికి కడలియే - ఆ కడలి వంటివాడు శివుడు. ఈ అనంత విశ్వం ఆయనలోదే.
'లోకం లింగాత్మకం జ్ఞాత్వా అర్చయేత్ శివలింగకం' అని ఆగమం ఈ భావాన్నే చెప్పింది. 'లోకమంతా లింగాత్మకమని తెలిసి శివలింగారాధన చేయాలి' అని తాత్పర్యం.
'లింగగర్భం జగత్సర్వం' - జగమంతా లింగంలోనే ఉంది. విచిత్రమేమిటంటే- కొద్ది ఏళ్ళక్రితం విదేశాలకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థలు ఈ సమస్త విశ్వానికి సంబంధించి ఉపగ్రహాల సహాయంతో గ్రహించిన విజ్ఞానాన్ని అనుసరించి ఒక చిత్రాన్ని ఆవిష్కరించారు. అద్భుతం- అది మన వేద విజ్ఞానం వర్ణించినట్లు- ఒక గోళా(అండా)కృతిలో ఉన్న కాంతిపుంజ మధ్యంలో, సమస్త గ్రహ నక్షత్రాదులన్నీ ఇమిడి ఉన్నాయి. ఈ దృశ్యాన్ని యుగాలక్రితం తపశ్శక్తితో గ్రహించి, లింగాకృతిని సంభావించి, విశ్వచైతన్య శక్తితో వ్యక్తి చైతన్యాన్ని అనుసంధానించే ప్రక్రియను లింగార్చనగా, లింగధ్యానంగా ఆవిష్కరించిన మన మహర్షుల పాదాలకు నమోవాకాలు.
'యోఽగ్నౌ అప్సు య ఓషధీషు యో రుద్రో విశ్వా భువనా వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు' - అని వేదమంత్రం, "అగ్నిలో జలంలో ఓషధుల్లో, ఒకటేమిటి, సమస్తమున ప్రవేశించి ఉన్న రుద్రునకు (మహా తేజఃస్వరూపునకు) నమస్కారము" అని భావం.
ఇలా చూస్తే విశ్వమంతా పదకొండేసి విధాలుగా 55 రూపాలతో రుద్రుడు వ్యాపించి ఉన్నాడని చెప్పిన శ్రుతి విజ్ఞానం అబ్బురపరుస్తుంది. ఈ రుద్ర కళలు 55 ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయో చక్కని వివరణ మన శాస్త్రగ్రంథాలలో ఉన్నది.
1. యజ్ఞమునందు, 2. భౌతిక ప్రపంచంలోనూ, 3. మన శరీరంలో, 4. దేవతా వ్యవస్థలో, 5. అంతరిక్షంలో - ఈశ్వర శక్తి ఉంటుందనీ, వీటన్నిటినీ సమన్వయించి గ్రహించడమే యోగం, ఉపాసన, ఆరాధన అనీ శాస్త్ర పరిజ్ఞానం. ఈ ఐదింటికీ శాస్త్రీయ శబ్దాలు -
1. అధియజ్ఞం, 2. అధిభూతం (ఆధిభౌతికం), 3. అధ్యాత్మం, 4. అధి దైవతం, 5. అంతరిక్షం. ఈ ఐదింటిలోను ఒక్కొక్కదానిలో పదకొండు చొప్పున 55 ఈశ్వర రూపాలున్నాయి. ఆ పదకొండు "ఏకాదశ రుద్రులు" అంటారు. వారి లక్షణ, స్వభావ, శక్తి విశేషాలనుబట్టి నామాలున్నాయి. వాటి స్మరణయే మహాప్రభావవంతం. వివరంగా ఆ పేర్లను తెలుసుకుందాం:
1. అధియజ్ఞంగా : ఒక్కొక్క రుద్ర కళకీ మూడేసి పేర్లు ఈ శాస్త్రంలో కనబడుతున్నాయి.
1) సమ్రాట్, కృశాను, ఆహవనీయ, 2) విభు, ప్రవాహణ, ఆగ్నిధ్రీయ, 3) అవస్యు, దువస్వాన్, అచ్ఛావాకీయ, 4) అంధారి, బంభారి, నేష్ట్రీయ, 5) ఉక్షిక్, కవి, పోత్రీయ, 6) బుధ, వైశ్వ వేదస, బ్రాహ్మణాంశంస్య, 7) వహ్ని, హవ్యవాట్, హోత్రీయ, 8) స్వాత్ర, ప్రచేత, ప్రశాస్త్రీయ, 9) శుంధ్యు, శుంధ్యు, మార్జాలీప, 10) అహిర్బుధ్న్య, అహిర్బుధ్న్య, ప్రత్యగార్హపత్య, 11) అజ ఏకపాత్, అజ ఏకపాత్, నూతన గార్హపత్య.
వీటిని యజ్ఞపరమైన ఏకాదశ రుద్రులుగా వేదబ్రాహ్మణ గ్రంథాలు చెబుతున్నాయి. విశ్వంలో వివిధ కార్యాలను చేసే యజ్ఞాగ్ని రూప ఈశ్వర శక్తులు వీరు.
2. అధిభూతంగా: భౌతిక జగతిలో అనుభూతికి వచ్చే ప్రకృతి పదార్థాలలోనున్న ఈశ్వరశక్తులు, ఈ పదకొండు కళలు :
1) పృథ్వి, 2) జలం, 3) తేజస్సు, 4) వాయువు, 5) ఆకాశం, 6) సూర్య, 7) చంద్ర, 8) ఆత్మ, 9) పవమాన, 10) పావక, 11) శుచి. ఇందులో 8 రుద్ర మూర్తులు 'సౌమ్య' రూపాలు, మిగిలిన మూడు తీవ్ర రూపాలు. ఈ ఘోరాఘోర రూపాలు జగన్నిర్వహణకు పనిచేసే పరమేశ్వర విభూతులు,
🧿
#yrr_playlist_youtube.!*
📤
https://youtube.com/playlist?list=PLDmczuKvRxqHe6SLQ9_8CPJbwITQu_ucO&si=o3s9DrCWmQ9iRpGE
♻️
👁️
🗣️VOB_APTS
https://whatsapp.com/channel/0029VaAjrR34NVioe5NqrV0Y
3. ఆధ్యాత్మంగా : జీవుల శరీరాలలో ఉండే వివిధేంద్రియ చైతన్యాలు, ప్రాణరూపాలు ('అధ్యాత్మం...' అనే 'ఇక్కడి' మాటల్లోని ఆత్మకి 'శరీరం' అని అర్థాన్ని మాత్రమే స్వీకరించాలి).
1) శ్రోత్ర ప్రాణ (రెండు), 2) చక్షు ప్రాణ (రెండు), 3) నాసా ప్రాణ (రెండు), 4) వాక్ ప్రాణ, 5) నాభి ప్రాణ, 6) దీపస్త ప్రాణ, 7) వాయు ప్రాణ, 8) ఆత్మ ప్రాణ (మధ్య ప్రాణ)
-ఇవి మనలోని ఏకాదశ రుద్ర స్వరూపాలు.
ఈ పదకొండింటిని శాస్త్రం మరో పేర్లతో కూడా చెబుతున్నది.
1) వాక్ ప్రాణ, 2) పాణి ప్రాణ, 3) పాద ప్రాణ, 4) ఉపస్థ ప్రాణ, 5) పాయు ప్రాణ, 6) శ్రోత్ర ప్రాణ, 7) త్వక్ ప్రాణ, 8) చక్షుః ప్రాణ, 9) జిహ్వా ప్రాణ, 10) ఘ్రాణ ప్రాణ, 11) మనఃప్రాణ.
మొత్తానికి మన శరీరంలోని ప్రాణ శక్తులు పదకొండు ఈశ్వరుని రూపాలుగా గుర్తించడమనే భావన ఒక దివ్యభూమిక.
4. అధి దైవతంగా: దేవతారూపాలుగా ఉన్న ఏకాదశ రుద్రులు :
1) అజుడు, 2) ఏకపాదుడు, 3) అహిర్బుధ్న్యుడు, 4) త్వష్ట, 5) రుద్రుడు, 6) హరుడు, 7) శంభుడు, 8) త్ర్యంబకుడు, 9) అపరాజితుడు, 10) ఈశానుడు, 11) త్రిభువనుడు.
ఈ పేర్లలో పాఠాంతరాలు (భిన్న భిన్న నామాలు) కూడా ఉన్నాయి.
5. అంతరిక్ష పరంగా: అంతరిక్షంగా జ్యోతిర్మయ శక్తులుగా ఉన్న పదకొండు రుద్రకళలు:
1) బ్రాజమాన, 2) వ్యవదాత, 3) వాసుకి, 4) వైద్యుత, 5) రజత, 6) పురుష, 7) శ్యామ, 8) కపిల, 9) అతిలోహిత, 10) ఊర్ధ్వ, 11) అవపత్య.
ఈ విధంగా ఏకాదశ రుద్ర రూపాలు ఐదు స్థానాలలో ఉన్నారు. వీరి ప్రభావం జగతిపై ప్రతిజీవిపై ఉంటుంది..
ఈ ఏభైఐదు కళల రుద్రతత్వం విశ్వవ్యాపక పరమేశ్వర శక్తి. సమగ్రంగా ఈ కళలు కలిగిన విశ్వపరీవ్యాప్త భగవత్స్వరూపాన్ని 'మహాలింగం' అనాలి.
ఈ దర్శనం శివలింగధ్యానంలో అనూచానంగా ఉన్నది.
ఆ పాతాళ నభఃస్థలాంత భువన బ్రహ్మాండ మావిస్ఫురత్
జ్యోతిఃస్ఫాటిక లింగమౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతైః
అస్తో కాప్లుతమేక మీశమనిశం రుద్రాను వాకాన్ జపన్
ధ్యాయేదీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేత్ శివమ్॥
"మన కంటికి అగుపడని అధోలోకాలను మొదలు కొని, అగోచరమైన అనంతాకాశపుటంచుల వరకు వ్యాపించిన జ్యోతిర్మయ నిర్మల స్వరూపం, శక్తిచే ఆర్షమై ఉన్నది" అని ఇందులో వర్ణించిన శివలింగం,
ఈ ఏభైఐదు కళల ఏకాదశ రుద్రులు సంపూర్ణంగా ఉండే మరో స్వరూపం సూర్యమండలం. దీనిద్వారా మన భూమి మొదలైన గ్రహాదుల వ్యవస్థ సాగుతున్నది. కనుక మన మేరకు సూర్యుడే జ్యోతిర్లింగం. అందుకే పురాణాల్లో సూర్యుని శివలింగంగా భావించి ఆరాధించమన్నారు.
ఆదిత్యం చ శివం విద్యాత్ శివమాదిత్యరూపిణమ్ ఉభయోరంతరం నాస్తి ఆదిత్యస్య శివస్యచ॥ (భవిష్యోత్తర పురాణం)
ఆదిత్యునకు, శివునకు - అభేదాన్ని చెప్తున్నాయి శాస్త్రాలు.
సౌరమండల మధ్యస్థం సాంబం సంసారభేషజమ్!
నీలగ్రీవం విరూపాక్షం నమామి శివమవ్యయమ్!! (శివ సిద్ధాంత గ్రంథాలు) 'సూర్యమండల మధ్యలో అంబతో ఉన్న నీలకంఠుడు, విరూపాక్షుడు, సంసార రోగానికి ఔషధం వంటివాడు అయిన శివుడు" ఉన్నాడని ఈ ధ్యాన శ్లోకోక్తి,
..."సంకర్షణ స్వరూపో యోఽసావాదిత్యః పరమపురుష స ఏవ రుద్రో దేవతా" అని రుద్రమంత్ర న్యాస విధి. 'ఏకాదశ రుద్ర రూపకమైన ఆదిత్య తేజస్సే సంకర్షణ రూపం' అనే ఈ దృష్టి శివవిష్ణు సమన్వయం. జ్యోతిష శాస్త్రపరంగా సూర్యునకు రుద్రుడే అధిదేవత.
పై కారణాల చేత సూర్యుడే జ్యోతిర్లింగం. ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క విధంగా శక్తినీ, ప్రకాశాన్ని అందిస్తున్న సూర్యుని ఆయా మాస భేదాలననుసరించి ద్వాదశాదిత్యులుగా వ్యవహరిస్తున్నాయి ధార్మిక శాస్త్రాలు. అందుకే ద్వాదశ జ్యోతిర్లింగ భావనగూడా వచ్చినది.
"ఏతే చ పంచాశత్ రుద్రా యత్ర సమాశ్రితాః!
తదేకం లింగమాఖ్యాతం తత్రేదం సర్వమాస్థితమ్!!
"ఈ ఏభైఐదు కళలు ఎక్కడుంటాయో అదే లింగం. దానియందే సర్వమూ ఉన్నది" అనే శాస్త్ర వచనం 'శివలింగం'లోని పరమేశ్వర స్ఫురణను అందిస్తోంది.
ఆ పరంజ్యోతిర్లింగానికి నమస్సులు.🙏
🌸🍀🌸🍀🌸🍀🌸🍀🌸🍀🌸🍀
🧿
#yrr_playlist_youtube.!*
📤
https://youtube.com/playlist?list=PLDmczuKvRxqHe6SLQ9_8CPJbwITQu_ucO&si=o3s9DrCWmQ9iRpGE
♻️
👁️
🗣️VOB_APTS
https://whatsapp.com/channel/0029VaAjrR34NVioe5NqrV0Y
💥వై రాఘవేంద్రరావు.
ఏలూరుజిల్లాBJP.
తూర్పుమండలకార్యదర్శి,
సోషల్మీడియాకన్వీనర్.
స్వచ్చంద సామాజిక కార్యకర్త.!
👉JOin🔜🔔telegram-Group®👇
https://t.me/hindu_Samajam
https://t.me/hinduSamajam
https://t.me/gaana_sudha
*🦋🍁🍀🍀🍁🦋*