@VoiceOfBjpTeluguStates_Yrr.!®️
@VoiceOfBjpTeluguStates_Yrr.!®️
February 27, 2025 at 11:55 PM
ఆరెస్సెస్ గురించి కొన్ని కఠోర నిజాలు.... ®️ https://t.me/hindu_Samajam/182956 https://t.me/gaana_sudha/218644 https://t.me/hinduSamajam/284140 👁️ https://whatsapp.com/channel/0029VaAjrR34NVioe5NqrV0Y/5560 🧿 #yrr_playlist_youtube.!* 📤 https://youtube.com/playlist?list=PLDmczuKvRxqHe6SLQ9_8CPJbwITQu_ucO&si=o3s9DrCWmQ9iRpGE ♻️ మొదటిది ఆరెస్సెస్ ఏమీ రుచికరమైన సంస్థ కాదు... మోదీని..మరో రాజకీయ నాయకుడ్ని చూసి ఆరెస్సెస్ లో జేరితే ఏమీ అర్థం కాదు... బీజేపీ లేదా ఏ అయోధ్య రామ మందిర నిర్మాణ సంస్థనో చూసి ఆరెస్సెస్ ను అర్థం చేసుకోలేరు... ఆరెస్సెస్ నడిపే శాఖ చాలా విచిత్రంగా ఉంటుంది... ఓ నలభై నిమిషాలు వ్యాయామాలే ఉంటాయి... కాకపోతే సూర్యనమస్కారాలు...కబడ్డీ...కొద్దిగా యోగా ఇలాంటివి... కాస్సేపు అడుగులో అడుగు కలిపి చేసే మార్చ్ ఫాస్ట్ లాంటి డ్రిల్ ఉండచ్చు... మిగతా ఇరవై నిమిషాలు...దేశభక్తి పాట...ఒక మంచి శ్లోకం...కొంచెం సేపు చిన్న కథ..అంతే... ఆదివారం కొద్దిగా ఓ అరగంట ఎక్కువ టైము ఉంటే...ఒక చర్చ...లేదా పెద్ద దేశ భక్తుని కథ...ఎవరైనా వస్తే చరిత్ర...సమకాలీన అంశం పై ఉపన్యాసం ఉండచ్చు... అంతే...ఇంకేమీ ఉండదు... వంద సంవత్సరాలుగా ఇదే తంతు... రోజూ కలుస్తారు కాబట్టి...కుటుంబాలతో సన్నిహిత సంబంధాలు ఉంటాయి... నలుగురు కలిసి నాలుగు మంచిమాటలు మాట్లాడుకుంటారు కాబట్టి...అలా వెళ్ళి ఏవో నాలుగు మంచి పన్లు చేద్దాం అన్న ఫీలింగ్ కలిగితే అది ఆరెస్సెస్ తప్పు కాదు... జిహ్వకో రుచి...పుర్రెకో బుద్ధి అన్నారు కాబట్టి...ఏదో ఒకటి నచ్చి ఆ పనిలో నిపుణత పెంచుకుంటే....ఆ శాఖకి వచ్చే ఎవరో ఒకరు సహాయ పడొచ్చు...ప్రోత్సహించచ్చు..అదీ ఆరెస్సెస్ తప్పు కాదు.... ఇంక శాఖకు వచ్చే వాళ్ళు కూడా ఈ గొప్ప సమాజం లోంచే కాబట్టి... ఆశలు.. గోసలు...ఎక్స్ట్రాలు అన్నీ ఉండచ్చు... బుద్ధి కర్మానుసారిణే అన్నారు కాబట్టి...రాజకీయాలు... రొంపి...గొప్ప సమాజ సేవ...ఏదో ఒకటి పద్ధతిగా చెయ్యడం అలవాటు అవుతుంది... బుద్ధిమంతుడు అయ్యే లక్షణాలు ఉన్నవాడు ఆరెస్సెస్ లోకి వస్తాడా...వచ్చిన తరువాత బుద్ధిమంతుడు అవుతాడా అన్నది నాకు ఇప్పటివరకూ అంతు బట్టలేదు... ఆరెస్సెస్ బీజేపీలోకి వెళ్లడానికి చాలా దూరం దారి... అదేదో షార్ట్ కట్ అనుకుని వచ్చాడా....వాడి పులుసు కారిపోతుంది... ఇంకో గొప్ప చిత్రమైన స్థితి ఏమిటంటే...శాఖకి ఇప్పుడు మానేసిన ప్రతి వాడు నేను శాఖకి వెళ్ళినప్పుడు ఆరెస్సెస్ మా గొప్పగా ఉండేది అని చెప్పుకుంటాడు... ఇప్పుడంతా అప్పటిలా లేదు అనుకుంటాడు... మారింది వీడి ఫేసు...తెల్లబడిన మీసాలు తప్ప...అద్దం లాంటి ఆరెస్సెస్ కాదు అని తెలుసుకుని మళ్ళీ ఏదో ఒక పనిలో దూరి జీవితాంతం ఆరెస్సెస్ స్వయం సేవక్ ను అని బ్రతుకుతాడు... ఇన్ని నిజాలు తెలుసుకుని కూడా శాఖకి వెళితే...ఇంక వాడ్ని ఎవ్వరూ బాగుచెయ్యలేరు... అలా దేశం కోసం పరితపిస్తూ కన్ను ముయ్యాల్సిందే...వాడి స్వంతానికి ఏం లభించినా లభించక పోయినా... ఇప్పుడు కూడా శాఖకి పోతున్నా...ఏమైనా కొత్తగా తెలుస్తుంది ఏమో అని... మీ ఇష్టం మీది.... మర్చిపోయా...అరెస్సెలో చేరడానికి సభ్యత్వం గట్రాలు ఏమీ ఉండవు...డైరెక్ట్ గా వెళ్లిపోయి అక్కడ ఉన్న ధ్వజానికి ప్రణామం చెయ్యడమే... ఇంత సింపుల్... జైహింద్!... Srihari Mangalapalli గారి వాల్ నుండి 💥వై రాఘవేంద్రరావు. ఏలూరుజిల్లాBJP. తూర్పుమండలకార్యదర్శి, సోషల్మీడియాకన్వీనర్. స్వచ్చంద సామాజిక కార్యకర్త.! 👉JOin🔜🔔telegram-Group®👇 E:- Some harsh truths about the RSS.... ®️ https://t.me/hindu_Samajam/182956 https://t.me/gaana_sudha/218644 https://t.me/hinduSamajam/284140 👁️ https://whatsapp.com/channel/0029VaAjrR34NVioe5NqrV0Y/5560 🧿 #yrr_playlist_youtube .!* 📤 https://youtube.com/playlist?list=PLDmczuKvRxqHe6SLQ9_8CPJbwITQu_ucO&si=o3s9DrCWmQ9iRpGE ♻️ First of all, RSS is not a tasty organization... If you see Modi...or any other politician and join the RSS, it doesn't make any sense... You can't understand the RSS by looking at the BJP or any Ayodhya Ram temple construction organization... The RSS-run branch is very strange... There will be forty minutes of exercises... Otherwise, sun salutations...kabaddi...a little yoga and such... There might be a drill like marching fast, where you step on the ground for a while... The remaining twenty minutes...a patriotic song...a good hymn...a short story for a while...that's all... If there is a little more time on Sunday, maybe a half hour... a discussion... or a story of a great patriot... if someone comes, there could be a lecture on history... a contemporary topic... That's it...nothing else... This has been the same thread for a hundred years... They meet every day, so they have close relationships with their families. Since four people speak four good words together...if we feel like going out and doing four good deeds, it's not the RSS's fault... The tongue has a taste... the brain has a mind... so they say... if you like something and become proficient in that work... someone who comes to that branch can help you... encourage you... that's not the RSS's fault... And since those who come to the branch are also part of this great community... hopes.. wishes... all the extras can be there... They say that intelligence is the key to action...politics...success...great social service...doing something systematically becomes a habit... I still don't know whether a person with the qualities of being intelligent will join the RSS... or whether he will become intelligent after joining... It's a long road for RSS to join BJP... Did he come here thinking that was a shortcut....his soup is leaking... Another great picture is that...everyone who has left the branch now says that when I joined the branch, the RSS was great... He thinks things aren't the same now... His face has changed...except for the whitened moustache...knowing that he is not the RSS like the mirror, he again gets involved in some work and lives his life as an RSS Swayamsevak... Even after knowing all these facts, if he goes to the branch...no one can fix him anymore... One has to close one's eyes in sorrow for one's country...whether one gets what one wants or not... I'm still going to the branch... hoping to find out something new... It's up to you.... Forgot...there are no membership requirements to join the RSS...just go directly and bow to the flag there... So simple... Jai Hind!... From Srihari Mangalapalli's wall 💥Y Raghavendra Rao. Eluru District BJP. Eastern Zone Secretary, Social Media Convener. Volunteer social worker.! 👉JOin🔜🔔telegram-Group®👇 2️⃣ 100 సంవత్సరాలైనా సంఘ్ సంఘ్ లాగే వుంది : సహ సర్ కార్యవాహ అరుణ్ కుమార్ --- ABP నెట్ వర్క్ మీడియా సంస్థ ‘‘ఐడియా ఆఫ్ ఇండియా 2025’’ సమ్మిట్ లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సహ సర్ కార్యవాహ్ అరుణ్ కుమార్ మాట్లాడారు. ఇందులో సంఘ్ విజన్, ఎదుగుదల, భారత్ భవిష్యత్తు, భాష ప్రాముఖ్యతతో పాటు తదితర విషయాలను మాట్లాడారు. అయితే.. రాజకీయ శక్తితో ఆరెస్సెస్ కి వున్న సంబంధంలో వస్తున్న ఊహాగానాలను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. అలాగే సంఘ్, దాని భావజాలం, క్రమశిక్షణ, దేశ నిర్మాణంలో సంఘ్ పాత్రపై కూడా మాట్లాడారు. సంఘ్ ను తరుచుగా తప్పుగా అర్థం చేసుకుంటారని, ఎందుకంటే దాని గురించిన అవగాహన సంస్థ కంటే వేగంగా ప్రయాణిస్తుందన్నారు. భారత్ శాశ్వతమైన దేశం అన్న నమ్మకంతో సంఘ భావజాలం పేరుకుపోయిందన్నారు. భారత దేశ జాతీయత వేలాది సంవత్సరాలుగా అవిచ్ఛిన్నంగా, నిరంతరాయంగా కొనసాగుతోందని చెబుతూ రామాయణం నుంచి చారిత్రక అంశాలను ఉదహరించారు. 1. యాంకర్ : ఆరెస్సెస్ ఇంత సమాజ సేవ చేస్తోందని, అంత చేస్తున్నా... ప్రచారం ఎందుకు చేసుకోరు? అరుణ్ కుమార్ : మనుషులను తయారు చేసే పని సంఘ్ చేస్తుందన్నారు. తాము సమాజ సహకారంతో పనులన్నీ చేస్తున్నామని, కేవలం సంఘ్ ఒక్కటే సేవా పనులు చేయడం లేదన్నారు. సంఘ్ సంకల్పం చేస్తుందని, ముందుంటుందని, కానీ.. సమాజంలోని వివిధ వర్గాలు, వివిధ రకాల మనుషులు పనులు చేయడానికి తమ వంతు సహకారాలు అందిస్తారన్నారు. సమాజంలోని వివిధ వ్యక్తులను కలుపుకు వెళ్తుంది. సమాజంలోని వివిధ సంస్థల సహాయం కూడా తీసుకుంటుంది.వీరందరితో కలిసే సంఘ్ పనులు చేస్తుంది.కేవలం ఆరెస్సెస్ మాత్రమే ఈ పనులన్నీ చేస్తోందని మేం ఎప్పుడూ చెప్పం. ఎందుకంటే సమాజం మొత్తం ఇందులో సహాయ సహకారాలను అందిస్తోంది. రెండోది.. పనిచేస్తూ పోతే అదే ప్రచారం అవుతుంది. కార్యక్షేత్రంలో ఎంత పని పెరుగుతూ పోతే.. దానంతట అదే ప్రచారం జరుగుతుంది. ఎక్కువ ప్రచారం చేసే పనిలో వుండొద్దు. పని కంటే ప్రచారమే ఎక్కువగా జరిగితే సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఎంత పని చేస్తే.. అంతే ప్రచారం కావాలి. అంత కంటే ఎక్కువ ప్రచారం అవసరమే లేదు. అని అన్నారు. 2. మైనారిటీలు ఇబ్బందుల్లో వున్నారా? సంఘ ఆలోచన ఏమిటి? అరుణ్ కుమార్: భారత్ లో మైనారిటీలకు ఇబ్బంది లేదు. 1947 లో బంగ్లాదేశ్ లో హిందువులు 32 శాతం వుండేవారని, ఇప్పుడు హిందువుల జనాభా 8 శాతానికి పడిపోయిందన్నారు. అదే భారత్ లో ముస్లిం జనాభా 8 నుంచి 9 శాతం వుండేదని, ఇప్పుడు 14, 15 శాతానికి ఎగబాకింది. ఇప్పుడు ఎలా పోలుస్తారు? చెదురు ముదురు ఘటనలను పట్టుకొని, పెద్దది చేయడం సరైంది కాదన్నది నా అభిప్రాయం. బంగ్లాదేశ్, పాక్ లో జరిగినట్లుగా ఇక్కడ జరగదు. అన్ని మార్గాలూ సరైనవే అన్న భావాన్ని భారత్ లో నమ్ముతారు. కానీ కొన్ని సార్లు భారతీయుల విశాలత్వాన్ని, ఉదార భావాలను అలుసుగా తీసుకుంటారు. అప్పుడే ఇబ్బందులు వస్తున్నాయి. వాటి నుంచి కూడా మెళ్లిమెళ్లిగా బయటపడతాం. బంగ్లాదేశ్ లో, పాక్ లో హిందువులు, మైనారిటీలపై జరిగిన విషయాలను భారత్ లో పోల్చలేం. అసలు పోల్చడమే తప్పు. 3. సంఘ్ 100 సంవత్సరాల ప్రయాణాన్ని మీరెలా చూస్తారు? అరుణ్ కుమార్ : కొన్ని విషయాల్లో పూర్తిగా సంతృప్తితోనే వున్నాం. మరికొంత అసంతృప్తీ వుంది. సంతృప్తి పరంగా చూసుకుంటే... 100 సంవత్సరాలు నిండినా.. సంఘ్ సంఘ్ లాగా వుంది. ఏ సిద్ధాంతాలతోనైతే ప్రయాణం ప్రారంభించామో... వాటికి అనుగుణంగానే నడుస్తున్నాం. రెండో మాట... సంఘ్ ఇప్పటికీ నూతనత్వం, జవసత్వాలతో నిండి వుంది. వృద్ధుల సంఘటన కాదు. కొత్త తరం ఎప్పటికప్పుడు సంఘ్ తో కలిసి వస్తోంది. మూడోది... యావత్ సమాజం సంఘ్ ను స్వీకరించింది. తనలో కలుపుకుంది. స్వతస్సిద్ధంగా సంఘ్ తో కలిసి ప్రయాణించడానికి సిద్ధమైంది. అసంతృప్తి చూసుకుంటే... సంఘ్ ను స్థాపించిన డాక్టర్జీ ఒకానొక సమయంలో మాట్లాడుతూ... శతాబ్ది ఉత్సవాలను జరుపుకునేందుకు సంఘ్ స్థాపన కాలేదన్నారు. అత్యంత వేగంగా, అత్యంత శీఘ్రంగా తాము అనుకున్న పనులు పూర్తి చేసేయాలి. అయితే.. అసంతృప్తి ఏమంటే.. సమాజాన్ని ఎలా తయారు చేయాలనుకున్నామో, నిర్మాణం చేయాలనుకున్నామో, మా పనులు పూర్తి చేయాలనుకున్నామో... మాకు 100 సంవత్సరాలు పట్టిందని. ఇంకా సమయం పట్టేట్లు కనిపిస్తోంది. నిజానికి ఇంత సమయం పట్టొద్దు. ఇదొక్కటే మాకు అసంతృప్తి. 4.ఈ మధ్య ప్రజలు జాతీయవాదం వైపు విపరీతంగా మొగ్గు చూపుతున్నారు. సంతుష్టీకరణ రాజకీయాలను పూర్తిగా తిరస్కరిస్తున్నారు. ఈ మార్పును సంఘ్ ఏ విధంగా చూస్తుంది? అరుణ్ కుమార్ : దేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత.. మన పాలన మనం చేసుకునే అవకాశం లభించింది. చాలా సంవత్సరాలు వలస పాలనలో సాగింది. మొఘలులు, తురుష్కులు మన వ్యవస్థలను ధ్వంసం చేశారు. బ్రిటీష్ పాలనతో మనం ఆత్మ విస్మృతిలోని వెళ్లిపోయాం. స్వాతంత్రం సిద్ధించిన 75 సంవత్సరాల తర్వాత మన మూలాలు మనం తెలుసుకోవాలన్న ధ్యాస ప్రజల్లో వచ్చింది. ప్రజల్లో జాతీయవాదం పెరగడం, సంస్కృతి, సంప్రదాయాల పట్ల ప్రేమ పెరగడం, ఆత్మాభిమానం, స్వాభిమానం పెరగడం ఇది మంచి పరిణామాలే. ఆధ్యాత్మిక భావాల ఆధారంగా జీవించే జీవన శైలి ఏదైతే వుందో... అది నిర్మాణం జరుగుతోంది. మన దేశ సంస్కృతిని కాపాడుకోవాలన్న తపనతో పాటు నేనేం చేయగలను? అని చాలా మంది తమ దగ్గరికి వచ్చి అడుగుతుంటారు. మంచిదే. మరోవైపు సంతుష్టీకరణ రాజకీయాలను అందరూ తిరస్కరించాల్సిందే. సంతుష్టీకరణ విధానాల వల్లే దేశ విభజన జరిగింది. అది అత్యంత దురదృష్టకరం. దేశంలో జాతీయభావాలు పెరిగితే సంతుష్టీకరణ రాజకీయాలు పడిపోతాయి. 5. భారత్ లో భాషలపై అభిప్రాయం? భారతీయ భాషలన్నీ జాతీయ భాషలే, ప్రతి రాష్ట్రమూ తన భాషను ప్రోత్సహించాలి. అధికారిక వ్యవహారాలన్నీ అధికార భాషలోనే జరగాలి. భారత్ లో ఏ భాషా ప్రాంతీయ భాష కాదు. ‘‘ప్రతి భాషా జాతీయ భాషే. భాషపై వివాదం చెలరేగడం అత్యంత దురదృష్టకరం. ప్రతి రాష్ట్రం కూడా తన భాషను బాగా అభివృద్ధి చేసుకోవాలి. అధికారిక కార్యకలాపాలన్నీ ఆయా రాష్ట్రాల భాషల్లోనే జరగాలి. ఇప్పటికే ఓ అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ వుంది. ఉమ్మడి జాతీయ భాష అనేది కావాలి. అయితే... ఒకానొక దశలో సంస్కృత భాషే కానీ... అది ఇప్పుడు సాధ్యం కాదు కాబట్టి, హిందీని ఉమ్మడి జాతీయ భాష చేయాలి. హిందీ వద్దనుకుంటే మరో భాషను చేయాలి. ఇంగ్లీషు మాత్రం ఉమ్మడి జాతీయ భాష కాదు, అది విదేశీ భాష అవుతుంది. ఇదే విషయంపై ఆరెస్సెస్ ద్వితీయ సరసంఘచాలక్ గురూజీ తమిళనాడులో పర్యటిస్తున్న సమయంలోనూ అడిగారు. ఒకవేళ ఆంగ్లాన్ని జాతీయ ఉమ్మడి భాషగా పేర్కొంటే.. మన భాషల అస్తిత్వం ఇబ్బందుల్లోకి పడిపోతుందని గురూజీ చెప్పారు. అని అరుణ్ కుమార్ అన్నారు.🙏🙏🙏సే క ర ణ:వేదుల జనార్ధన రావు. 💥² #yraghavendrarao. #elurudistrictbjp. #easterndivisionsecretary, #socialmediaconvener. #volunteersocialworker. 👉JOin🔜🔔telegram-Group®👇 https://t.me/hindu_Samajam https://t.me/hinduSamajam https://t.me/gaana_sudha *🦋🍁🍀🍀🍁🦋*

Comments