
Penuganchiprolu Temple
February 4, 2025 at 02:15 AM
రథసప్తమి మహాపర్వదిన శుభాకాంక్షలతో శుభోదయం.
నేటి విద్యుక్త ధర్మాలను వివరించుకుందాం.
సంక్షిప్తంగా సంక్షేమంగా రధ సప్తమి జరుపుకునే విధానం.
మాఘశుద్ద సప్తమి ఇదే "సూర్య సప్తమి" లేదా రథసప్తమి అని కూడా పిలువబడుతుంది.
ఈ రథసప్తమి సుర్య గ్రహణం వలె పరమ పవిత్రమైనది.
ఈ రోజున స్నానానికి ముందు
నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః । అరుణాయ నమస్తేస్తు హరిదశ్వ నమోస్తుతే ॥
అను శ్లోకాన్ని చదువుతూ సూర్యభగవానుడికి నమస్కరించవలయును.
నేటి అరుణోదయ వేళలో జిల్లేడాకులు లేక చిక్కుడాకులు,లేక రేగు పళ్ళు తల పైనా ,బుజాలపైనా పొట్ట మీద ఉంచుకొని ఈ క్రింది శ్లోకాలు చదువుకుంటూ చన్నీళ్ళతో 3 సార్లు తలనిండా స్నానం చేయాలి
స్నానం చేసిన తర్వాత ,ఆరు బయట తులసి మొక్క దగ్గర ఆవు పిడకలపై పొంగలి వండి ,పాలు పొంగుతున్నప్పుడు ‘’నమో సూర్య నారాయణ ‘’అంటూ నమస్కరించి ,ఆ పొంగలిని 5 చిక్కుడాకులలో పెట్టి తులసి పూజ చేసి నైవేద్యం పెట్టాలి .మరొక 15 చిక్కుడుఆకులలో పొంగలి పెట్టి , సూర్యునికి నైవేద్యం పెట్టాలి .తర్వాత దీనినే ప్రసాదంగాకళ్ళకు అద్దుకొని అందరూ స్వీకరించి తినాలి .సూర్య దండకమో ఆదిత్య హృదయమో ,చదువుకోవాలి . వస్తే అరుణ పారాయణ౦ చేయాలి . .
చిక్కుడు కాయలతో రధం చేసి దాన్నే సూర్య రధంగా భావించాలీ .అవి దొరక్క పొతే బియ్యపు పిండితో రధం ముగ్గు వేయాలి .రధ సప్తమి అంటే సూర్యుని జన్మ దినం అన్నమాట .ప్రభవ నామ సంవత్సర ఉత్తరాయణ శిశిర ఋతువులో ,మాఘ శుద్ధ సప్తమి ఆదివారం అశ్వినీ నక్షత్రం లో సూర్యుడు జన్మించినట్లుపురాణాలు చెప్పాయి . మాఘ శుద్ధ సప్తమి ఉదయకాలం లో ఆకాశం లో గ్రహాలూ నక్షత్రాలు రధం ఆకారం లో కనిపిస్తాయి అందుకే రధ సప్తమి అనే పేరు వచ్చింది .సూర్యుడికి ఎరుపు రంగు ప్రీతి .అందుకే ఆయన పూజకు యెర్రని అక్షింతలు ,యెర్ర చందనం వాడాలి .సూర్యుడు సింహ రాశికి అధిపతి .ఆదివారం ఆయనకు చాలా ఇష్టం .దానినే భానువారం అంటారు .జగత్తుకు సాక్షి ,సర్వ సాక్షి ,ఆరోగ్య ప్రదాత భాస్కరుడు .సూర్యనమస్కారాలు గొప్ప ఆరోగ్యాన్నిస్తాయి .ఏ శ్లోకాలూ రాని వారు 1-ఆది దేవ నమస్తుభ్యం ప్రసీద మమభాస్కర –దివాకర నమోస్తుతే 2-సప్తాశ్వ రధ మారూఢం ప్రచండం కశ్యపాత్మజం –శ్వేతపత్ర (ఏక చక్ర )ధరం దేవం –తమ్ సూర్యం ప్రణమామ్యహం ‘’చదువుకోవచ్చు .
రధ సప్తమినాడే ఆడవాళ్ళు కొత్త నోములు ప్రారంభింకుంటారు . దీనినే నోము పట్టటం అంటారు .ఇదీ రధసప్తమి చేసే విధానం.
సూర్య భగవానుడి ఆశీస్సులు తో పాటుగా శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి ఆశీస్సులు కూడా మీకు మీ కుటుంబ సభ్యులకు ఉండాలి కోరుకుంటూ రథసప్తమి శుభాకాంక్షలు.
🙏
❤️
9